బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 16, 2020 , 23:19:43

పీఏసీఎస్‌ల్లో టీఆర్‌ఎస్‌ పాగా

పీఏసీఎస్‌ల్లో టీఆర్‌ఎస్‌ పాగా

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాథ మిక సహకార పరపతి సంఘాల్లో (పీఏసీఎస్‌)గులాబీ జెం డా ఎగిరింది. ఆదివారం అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ప్రశాం తంగా ముగిసింది. 12 సహకార సంఘాల్లో.. పదింటా చైర్మ న్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం కాగా, దహెగాం సహకార సంఘం ఎన్నిక సోమవారానికి వాయిదా పడింది. 


10 సంఘాల్లో ఏకగ్రీవం

సహకార సంఘాల్లో ఏకగ్రీవాల పర్వం కొనసాగింది. జి ల్లాలోని 12 సహకార సంఘాల పరిధిలోని 155 డైరెక్టర్‌ స్థా నాల్లో 113 స్థానాలు ఏకగ్రీవం కాగా, శనివారం 42 స్థా నాలకు ఎన్నికలు నిర్వహించారు. తాజాగా ఆదివారం చై ర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికల్లోనూ 90 శాతం సంఘాలు ఏ కగ్రీవాలే అయ్యాయి. సిర్పూర్‌-టి, దహెగాం మండలాలు మినహా మిగతా 10 స్థానాలు పూర్తిగా ఏకగ్రీవ మయ్యాయి. ఇందులో ఎన్నికల కంటే ముందే కాగజ్‌నగర్‌, కెరమెరి, తి ర్యాణి మండలాల్లో డైరెక్టర్‌ స్థానాలు పూర్తిగా ఏక గ్రీవం కా గా, మిగితా 9 మండలాల్లోని 74 డైరెక్టర్‌ స్థానాలు కూడా యూనానిమస్‌ అయ్యాయి. ఆసిఫాబాద్‌, వాంకిడి, రెబ్బెన, తిర్యాణి, కెరమెరి, జైనూర్‌, సిర్పూర్‌-యు, కాగజ్‌నగర్‌, కౌటాల, బెజ్జూర్‌ సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. 


దహెగాం ఎన్నిక వాయిదా

దహెగాం సహకార సంఘంలో  చైర్మన్‌ పదవి కోసం కొండ్ర తిరుపతి గౌడ్‌, అల్గం మల్లేశ్‌, బాలకిషన్‌ గౌడ్‌ పోటీ పడ్డారు. సయోధ్య కుదరక పోవడంతో ఎన్నిక వాయిదా వేశారు. 


సిర్పూర్‌-టిలో రహస్య బ్యాలెట్‌

సిర్పూర్‌-టి సహకార ఎన్నికల్లో చైర్మన్‌ పదవి కోసం మా నెపల్లి బాపు, నగరాడే రాజు పోటీ పడగా అధికారులు ర హస్య బాలెట్‌ నిర్వహించారు. మానేపల్లి బాపునకు 8 ఓట్లు రాగా, నగరాడే రాజుకు 5 ఓట్లు వచ్చాయి. దీంతో మానేపల్లి బాపు చైర్మన్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.


logo
>>>>>>