శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 16, 2020 , 02:12:36

టీఆర్‌ఎస్‌కి సహకారం

 టీఆర్‌ఎస్‌కి  సహకారం


కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో నిర్వహించిన ప్రాథమిక సహకార పరపతి సంఘాల ఎన్నికల్లో రైతులు టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులకే పట్టం కట్టారు. జిల్లాలోని 12 సహకార సంఘాల్లో కెరమెరి, తిర్యాణి, కాగజ్‌నగర్‌ సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. మిగితా 9 సంఘాల పరిధిలోని 74 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం టీఆర్‌ఎస్‌ ఖాతాలో చేర గా మిగితా 42 స్థానాలకు శనివారం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుపొందారు. జిల్లాలోని మొత్తం 155 స్థానాల్లో 143 టీఆర్‌ఎస్‌ కైవసం చే సుకోగా, కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కేవలం 8 స్థా నాలకే పరిమితమయ్యారు. బీజేపీ ఒక స్థానంలో ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు. కాగా శనివారం జరిగిన ఎన్నికల్లో 5764 మంది ఓటర్లుగాను 4312 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. దీంతో 74.9 పోలింగ్‌ శాతం నమోదైంది.


ప్రశాంతంగా పోలింగ్‌..

జిల్లాలో శనివారం నిర్వహించిన సహకార ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్దకు తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలిం గ్‌ నిర్వహించిన అధికారులు ఆ తరువాత కౌటింగ్‌ నిర్వహించి ఫలితాలను వెలువరించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌  ప్రారంభం కాగా, ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 10.96 శాతం, 10 గంటలకు 22.38 శాతం, 11 గంటల వరకు 55.10 శాతం 12 గంటల వరకు 69.50 శాతం, ఒం టి గంట వరకు 74.8 శాతం మంది ఓటర్లు ఓట్లు వేశారు. మొత్తం 5764 మంది ఓటర్లకు గాను 4312 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 


12 సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్‌ జయకేతనం

సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జయకేతనం ఎగురవేసింది. పా ర్టీలతో సంబంధం లేకుండా జరిగిన ఎన్నికలే అయినప్పటికీ, టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే ఓటర్లు ఎన్నుక్నునారు. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీనే ఆదరిస్తున్న ప్రజలు మరోసారి, వారి ఆదరణను చాటారు. విజేతల ప్రకటన అనంతరం అభిమానులతో కలిసి అభ్యర్థులు ర్యాలీ తీస్తూ, నృత్యాలు చేశారు. కాగా, ఆదివారం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.


logo