గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 16, 2020 , 02:07:58

గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి

గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి

ట్నూర్‌, నమస్తే తెలంగాణ :  గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఐటీడీఏ పీవో భవేశ్‌ మిశ్రా అన్నారు. శనివారం ఆయన పీవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంతో పాటు పలు కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం సబ్‌ కలెక్టర్‌గా 20 నెలలు విధులు నిర్వహించానని,  గిరిజనుల సమస్యలు తనకు పూర్తిగా తెలుసన్నారు. విలేకరుల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ గిరిజనుల్లో ఎక్కువగా ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ సమస్య ఉందన్నారు. దానిని సాధ్యమైన వరకు పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. ఐటీడీఏలోని అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను గిరిజనులకు అందించేందుకు కృషి చేయాలన్నారు. 


అలాగే ఎట్టి పరిస్థితులలోనూ అవినీతి, అక్రమాలకు ఉపేక్షించేది లేదన్నారు. గిరిజనులు ఐటీడీఏకు వచ్చి సమస్యలు చెప్పిన, ఫోన్‌, వాట్సప్‌ ద్వారా సమాచారం అందించిన పరిష్కారం చేస్తామన్నారు. తనది ఢిల్లీ అని, ఐఐటీ బీటెక్‌ పూర్తిచేసి 2015లో ఐఏఎస్‌కు సెలెక్ట్‌ అయ్యాయనన్నారు. తండ్రి మితిలేష్‌ కుమార్‌ మిశ్రా ప్రైవేట్‌ ఎంప్లాయి, తల్లి జయంతి, భార్య ఇలా త్రిపాఠి ఐఏఎస్‌ త్వరలో మంచిర్యాల్‌ జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకోనున్నట్లు చెప్పారు. అనంతరం ఐటీడీఏ అధికారులు, ఆర్డీవో, ఇతర శాఖల అధికారులు శాలువాతో సన్మానించి, బొకె అందించారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్‌ కనక భీంరావు, ఆర్డీవో వినోద్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.


logo
>>>>>>