శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 16, 2020 , 02:04:46

‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి

‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ : పదో తరగతి వార్షీక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ మార్చి 19 నుంచి ఏప్రిల్‌ 6 వరకు పరీక్షలు జరు గుతాయనీ, ఇందుకోసం 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల్లో తాగునీరు, బెంచీలు, ఫ్యాన్లు, పరీక్ష రాసే సమయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని సూచించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించా రు. ట్రాన్స్‌పోర్టుకు సంబంధించి ఎంఆర్‌వో, ఆర్టీ వో అధికారులు కలసి ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరా నిఘాలో ప్రశ్నాపత్రాలను ఓపెన్‌ చే యాలని , పోలీస్‌ బందోబస్తు  ఏర్పాటుతో పాటు 144 సెక్షన్‌ అమలు చేయాలన్నారు. ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ నియమించాలని, ఎలాంటి లోటు పాట్లు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆధికారులను ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని మండలాల్లో ఉదయం 7 గంటలకు బస్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌, డీఆర్వో ప్రభాకర్‌, డీఈవో పాణిని, ప్ర భుత్వ పరీక్షల సహా య కమిషనర్‌ ఉదయ్‌బాబు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


వారంలోగా ట్రాక్టర్లు అందించాలి 

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : వారంలోగా ప్రతి పంచాయతీకి ట్రాక్టర్లు, ట్రాలీ, ట్యాంకర్లను అం దేలా చూడాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా అ న్నారు. శనివారం కలెక్టరేట్‌ కార్యాలయం సమావేశం మందిరంలో ఎంపీడీవోలు, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాలీలు, ట్యాంకర్ల కోసం పంచాయతీ తీర్మాణం తీసుకున్న తర్వాత బ్యాంకుల ద్వారా లోన్‌ తీసుకొని  సంబంధిత జీపీలకు ట్రాలీ, ట్యాంకర్లు డెలవరీ ఆయ్యేలా చూడాలని తెలిపారు. ఏ ఒక్క ఎంపీడీవో అలసత్వం వహించిన  చర్యలు త ప్పవని హెచ్చరించారు. వారంలోగా పూర్తి సమాచారంతో రిపోర్టు చే యాలని ఆదేశించారు. తనకు చెప్పకుండా ఎంపీడీవోలు హెడ్‌ క్వార్టర్‌ వదిలి వెళ్లవద్దనీ, ఒకవేళ్ల వెళ్లాల్సి వస్తే తన అనుమతి తీసు కోవా లన్నారు. 15 మండలాల్లోని 334 గ్రామపంచాయతీలకు ట్రాక్ట ర్లు అందించామనీ, 284, ట్యాంకర్లు 307, ట్రాలీలు 307 డెలవరీ పంపిణీ చేశామని సంబంధిత ఎంపీడీవోలు కలెక్టర్‌కు వివరించారు. ట్రైనీ కలెక్టర్‌ హేమంత్‌, జడ్పీ సీఈవో దాసరి వేణు, డీఆర్‌డీవో వెంకటశైలేశ్‌, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.


logo