బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 14, 2020 , 23:59:16

గురుకులం పిలుస్తోంది

గురుకులం పిలుస్తోంది

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల్లో అత్యుత్తమమైన విద్యాబోధనతోపాటు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇక్కడ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని గురుకులాల్లో 2020-21 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇందులో గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు మార్చి 1న తుది గడువుగా నిర్ణయించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 12న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహంచనున్నారు.


దరఖాస్తు విధానం..

టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి ,టీజీ గురుకులం సెట్‌ 2020 చీఫ్‌ కన్వీనర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ జారీ చేసిన ప్రకటన ప్రకారం గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వ ప్రకటన వెలువడింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను htt//tresidential.cgg.in , htt//tgcet.cgg.gov.in, www.tswreis.in ద్వారా ఆన్‌లైన్‌లో టీఎస్‌ ఆన్‌లైన్‌ లేదా మీ సేవా,ఈ సేవా కేంద్రాల్లో వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ కోసం విద్యార్థులు రూ॥ 100 చెల్లించాల్సి ఉంటుంది. ఉద్ధేశపూర్వకంగా ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, వేరేవారి ఫొటోలు పెట్టి దరఖాస్తు చేసేవారిపై సెక్షన్‌ 416 ఐపీసీ ( 1860) ప్రకారం క్రిమినల్‌ చర్యలు ఉంటాయి. ఇతర సమాచారం కోసం ఉచిత హెల్ప్‌లైన్‌ నంబర్‌ 180042545678 సంప్రదించాలి.


రిజర్వేషన్లు..

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఎస్సీ 75 శాతం ,బీసీ(సీ)కు 2 శాతం, ఎస్టీ 6శాతం, బీసీలకు 14 శాతం, మైనార్టీలకు 3 శాతం. ఇతరలకు 2 శాతం

గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఎస్టీలకు 80 శాతం, ఎస్సీలకు 12 శాతం, బీసీలకు 5 శాతం, ఇతరులకు 3 శాతం.

బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో బీసీ లకు 71 శాతం( బీసీ- ఏ కు 20 శాతం, బీసీ-బీ కి 28 శాతం,బీసీ డీకి 19 శాతం, బీసీ -ఈ కి 4 శాతం) ఎస్సీ లకు 15 శాతం, బీసీ -సీ కి 3 శాతం, ఎస్టీ లకు 6 శాతం ఇతరులకు 2 శాతం ,అనాథలకు 3 శాతం.

టీఆర్‌ఈఐఎస్‌ జనరల్‌ గురుకుల పాఠశాలల్లో ఎస్సీ 15 శాతం ,ఎస్టీలకు 6 శాతం ,బీసీ లకు 29 శాతం, మైనార్టీలకు , అనాథలకు, వికలాంగులకు 3 శాతం చొప్పన సైనిక ఉద్యోగుల పిల్లలకు 3 శాతం కేటాయించారు.


logo
>>>>>>