మంగళవారం 07 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 14, 2020 , 23:59:16

ఘనంగా కేశవనాథ స్వామి ఆలయ పున:ప్రతిష్ఠాపన

ఘనంగా కేశవనాథ స్వామి ఆలయ పున:ప్రతిష్ఠాపన

ఆసిఫాబాద్‌ టౌన్‌: జిల్లా కేంద్రంలోని బ్రహ్మణవాడలో నిర్మించిన శ్రీ కేశవనాథ స్వామి ఆలయం పున:ప్రతిష్ఠాపన కార్యక్రమాలు రెండో రోజు కొనసాగాయి.  వేదపండితులు పారువెళ్ల శ్రీధర్‌శర్మ ఆధ్యర్వంలో శుక్రవారం ఉదయం స్థాపిత దేవత నిత్య పూజ హావనములు, చండీయాగం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో వేదపండితులు శివరామశర్మ, శ్రీపాదశర్మ, దేవాదాయ శాఖ ఈవో బాపిరెడ్డి, ఆలయ అర్చకులు నరేశ్‌శర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రకాశ్‌చంద్ర మసాదే, బల్వంత్‌ సాదే, వైరాగరే మనోజ్‌, దేశ్‌ముఖ ప్రదీప్‌ పాల్గొన్నారు.   


logo