బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 14, 2020 , 23:55:22

పశుమిత్రలుగా స్వయం సహాయక సంఘాలకు అవకాశం

పశుమిత్రలుగా స్వయం సహాయక సంఘాలకు అవకాశం

కోటపల్లి : గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పశుమిత్రలుగా సేవలందించనున్నారు. సెర్ప్‌, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘంలోని 104మంది మహిళలకు శిక్షణ ఇచ్చి ప్రతి గ్రామంలో పశువులకు వైద్యం చేసేలా శిక్షణ ఇవ్వగా గ్రామాల్లో పశువైద్య సేవలను ప్రారంభించారు. అందుకుగాను హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో పశువైద్య విశ్వవిద్యాలయంలో మహిళలకు శిక్షణ ఇచ్చి వారికి మెడికల్‌ కిట్‌తో పాటు ధ్రువీకరణ పత్రం అందచేయగా ప్రస్తుతం గ్రామగ్రామాన పశు వైద్య సేవలు నిర్వహిస్తున్నారు. గ్రామాలలో పశువులకు వ్యాధులు వస్తే ఎక్కడో ఉన్న వైద్యుడు వచ్చి వైద్యం అందించాలి. మండలానికి ఒకటి లేదా రెండు దవాఖానలు ఉండడం, సరిపడా సిబ్బంది లేక సమయానికి వైద్య అందడం లేదు. ప్రతి గ్రామంలో పశు వైద్య సేవలను చేరువ చేసేందుకు సెర్ప్‌ ద్వారా గ్రామాల్లో మహిళా సంఘాల్లో పదో తరగతి వరకు చదువుకున్న ఒకరిని పశుమిత్రగా ఎంపిక చేశారు. వీరికి హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి రూ.2వేలు విలువ చేసే ఉచిత మెడికల్‌ కిట్‌ను అందించారు. వీరు గ్రామాల్లో పశు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి గ్రామంలో పశుమిత్రలను నియమించి శిక్షణ ఇస్తుండడం ద్వారా అంతటా పశువైద్య సేవలు సమర్థవంతంగా అందనున్నాయి. పశు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు పశువులకు జబ్బు చేసినప్పుడు ఇంటి వద్దే ప్రథమ చికిత్స సకాలంలో అందిస్తారు. ఫలితంగా నష్టం తగ్గించడంతో పాటు గ్రామాల్లో పశు సంపద వృద్ధికి వీరి తోడ్పాటు అందించనున్నారు.


logo
>>>>>>