బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 14, 2020 , 23:46:12

నేడే సహకార పోరు

నేడే సహకార పోరు
  • 42 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు
  • పర్యవేక్షించిన డీఎస్పీ సత్యనారాయణ
  • బ్యాలెట్‌ బాక్సులతో కేంద్రాలకు తరలిన సిబ్బంది
  • ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌
  • సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో శనివారం నిర్వహించనున్న సహకార ఎన్నికల కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 12 సహకార సంఘాల్లో మూడు ఏకగ్రీవం కాగా, మిగతా 9 సం ఘాల పరిధిలో 74 డైరెక్టర్ల స్థానాలు ఏకగ్రీవమయ్యా యి. మిగతా 42 డైరెక్టర్ల స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఒం టి గంట వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఆ వెంటనే 2 గంటల నుంచి కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాల ను వెలువరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చే శారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర పాఠశాలలో సిబ్బందికి బ్యాలెట్‌ బాక్సులతో పాటు ఇతర సామగ్రిని శుక్రవారం అందజేశారు. ఎన్నికలు జరుగునున్న 42 స్థానాల్లో 5,764 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.  


9 కేంద్రాల్లో 42 పోలింగ్‌ కేంద్రాలు

జిల్లాలోని 12 సహకార సంఘాల్లో కాగజ్‌నగర్‌, తిర్యాణి, కెరమెరి ఏకగ్రీవం కాగా, మిగితా 9 సంఘాల్లోని 42 వార్డుల్లో శనివారం ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు 42 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాలన్ని మండలా కేంద్రాల్లోని జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో ఏర్పాటు చేశారు. ఒక్కో బూత్‌లో ముగ్గురు సిబ్బంది చొప్పున మొత్తం 116 మంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని శుక్రవారం ఎ న్నికల సిబ్బందికి అప్పగించిన అధికారులు ప్రత్యేక వాహనాల్లో  పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు.


ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు తరలిన సిబ్బంది

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: సహకార సంఘాల ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రం లోని జడ్పీ బాలుర పాఠశాల వద్ద ఎన్నికల సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా జరుగునున్న సహకార ఎన్నికలకు సిబ్బంది కేటాయించడంతో పాటు వారికి ర వాణ సౌకర్యం కల్పించారు. సామగ్రి పంపిణీ కేంద్రాన్ని డీఎస్పీ సత్యనారాయణ  పరిశీ లించారు. జిల్లా సహకార ఆధికారి కృష్ణ సామగ్రి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. పంపిణీ కేంద్రం వద్ద ఎస్‌హెచ్‌వో మస్కా రా జు ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు  నిర్వ హించారు. ఎలాంటి సంఘటనలు జరుగ కుండా ఎన్నికలు సజావుగా జరిగేలా పోలీసు లు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా కేంద్రాల్లో పోలిం గ్‌ అనంతరం కౌంటింగ్‌, ఫలితాల వెల్లడి అ య్యేంతవరకు ప్రతి ఒక్కరూ ఎన్నికల సిబ్బం దికి సహకరించాలని అధికారులు కోరారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్త య్యేలా ఏర్పాట్లు చేసినట్లు  అధికారులు పేర్కొన్నారు.logo