శనివారం 29 ఫిబ్రవరి 2020
ఖాతాల్లోకి ‘రైతుబంధు’

ఖాతాల్లోకి ‘రైతుబంధు’

Feb 14, 2020 , 00:13:39
PRINT
ఖాతాల్లోకి ‘రైతుబంధు’

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న నిధులు రైతుల ఖాతాల్లోకి చేరుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 47,322 మంది రైతుల ఖాతాల్లో రూ. 49 కోట్ల 24 లక్షల 76 వేల 260 జమ అయ్యాయి. మొత్తం 75,165 మంది రైతులకు రైతుబంధు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 75,165 మంది రైతులకు అందించాల్సిన రూ. 102 కోట్ల 34 లక్షల 21 వేల 223 ట్రెజరీలకు పంపించారు. ట్రెజరీల నుంచి విడుతల వారీగా రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. మొదటి రెండు విడుతల్లో  ఎకరానికి రూ. 4 వేల చొప్పున రెండు పంటలకు పెట్టబడి సాయాన్ని అందించిన ప్రభుత్వం, గత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ఎకరానికి రూ. 5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో వేస్తోంది. రైతుల పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకం ద్వారా జిల్లాకు మంజూరైన నిధులు నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. 

ఇప్పటికే 47,322 మందికి..

జిల్లాలో ఇప్పటి వరకు 47,322 మంది రైతుల ఖాతాల్లోకి రూ. 49 కోట్ల 24 లక్షల 76 వేల 260 జమ చేశారు. ఆసిఫాబాద్‌ మం డలంలోని 4,228 మంది రైతుల ఖాతాల్లో రూ. 4 కోట్ల 15 లక్ష ల 36 వేల 697, రెబ్బెన మండలంలోని 3,992 మంది రైతులకు రూ. 3 కోట్ల 87 లక్షల 85 వేల 230, తిర్యాణి మండలంలో 2,764 మందికి రూ. 2 కోట్ల 71 లక్షల 89 వేల 190, వాంకిడి మండలంలోని 2,842 మందికి రూ. 3 కోట్ల 37 లక్షల 92 వేల 268, కాగజ్‌నగర్‌ మండలంలోని 5,427 మంది రైతులకు రూ. 5 కోట్ల 60 లక్షల 07 వేల 624, కౌటాల మండలంలోని 3,301 మంది రైతులకు రూ. 3 కోట్ల 39 లక్షల 3 వేల 234, సిర్పూర్‌-టి మండలంలోని 2,996 మంది రైతులకు రూ. 2 కోట్ల 91 లక్షల 13 వేల 998, బెజ్జూర్‌ మండలంలోని 3,899 మంది రై తులకు రూ. 3 కోట్ల 84 లక్షల 07 వేల 761, చింతలమానేపల్లి మండలంలోని 3,230 మంది రైతులకు రూ. 3 కోట్ల 40 లక్షల 41 వేల 923, దహెగాం మండలంలోని 4,420 మంది రైతులకు రూ. 4 కోట్ల 10 లక్షల 7 వేల 238, పెంచికల్‌పేట్‌ మండలంలోని 2,526 మంది రైతులకు రూ. 2 కోట్ల 38 లక్షల 86 వేల 002, జైనూర్‌ మండలంలోని 2,140 మంది రైతులకు రూ. 2 కోట్ల 65 లక్షల 39 వేల 840, కెరమెరి మండలంలోని 2,337 మంది రైతులకు రూ. 2 కోట్ల 94 లక్షల 57 వేల 845, లింగాపూర్‌ మండలంలోని 1,599 మంది రైతులకు రూ. 2 కోట్ల 06 లక్షల 41 వేల 070 రూపాయలు, సిర్పూర్‌-యు మండలంలోని 1,621 మంది రైతులకు రూ. కోటి 95 లక్షల 76 వేల 340లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగతా రైతులకు వీలైనంత త్వరగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 


logo