మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Feb 14, 2020 , 00:10:35

ఐక్యంగా అభివృద్ధి చేసుకుందాం

ఐక్యంగా అభివృద్ధి చేసుకుందాం

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు కోవ లక్ష్మి పేర్కొన్నారు. గురువారం స్థానిక జడ్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆ త్రం సక్కు, వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావుతో కలి సి ఏడు స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అధికారులు పల్లెల్లో చేప ట్టే అభివృద్ధి పనుల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలనీ, నేరుగా వెళ్లి పనులు చేపట్టడం వల్ల ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య దూరం పెరుగుతుందన్నారు. సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ, అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంద ని తెలిపారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించిన సమీక్ష సందర్భంగా డీలర్లు సమయ పాలన పాటించాలనీ, అధికారులు పేదలకు రేషన్‌ సక్రమంగా అందేలా చూడాలని సూచించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పది మందికి ఉపయోగపడేలా పనులు చేపట్టాలని కో రారు. యువజన, క్రీడల శాఖల సమీక్ష సందర్భం గా సక్కు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని పోలీ సు వినియోగిస్తున్న మైదానాన్ని యువజన, క్రీడ ల శాఖకు అప్పగించాలనీ, లేని పక్షంలో మరోచో ట క్రీడా మైదానాన్ని కేటాయించాలన్నారు. ప్రతీ మండల కేంద్రంలోనూ క్రీడా మైదానాలు ఏ ర్పాటు చేయాలనీ, యువకులకు ఎప్పటికప్పుడు క్రీడలు నిర్వహించి నైపుణ్యతను వెలికితీసేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం రెండో స్థాయి సంఘాల సమావేశం సాదాసీదాగా ముగిసింది. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణ, జడ్పీ సీఈవో దాసరి వేణు, డిప్యూటీ సీఈవో సాయగౌడ్‌, సూపరింటెండెంట్‌ తోటాజీ, జడ్పీటీసీలు కోవ అరుణ, అరిగెల నాగేశ్వర్‌రావు, సంతో ష్‌, దుర్పాబాయి, రామారావు, అజయ్‌, కో ఆప్షన్‌ సభ్యులు అబుద్‌ అలీ, సిద్ధిక్‌ అలీ తదితరులు ఉన్నారు.


logo
>>>>>>