ఆదివారం 24 మే 2020
Komarambheem - Feb 14, 2020 , 00:06:28

వనాల పెంపుతోనే మనుగడ

వనాల పెంపుతోనే మనుగడ

జైనూర్‌ : వనాల పెంపుతోనే మానవ మనుగడ ఉంటుందని డిప్యూటీ రేంజ్‌ అధికారి ప్రియంకా చౌహాన్‌ అన్నారు. గురువా రం మండలంలోని ఆయా గ్రామాల్లో అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణ, చట్టాలు, బాధ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవుల్లో నిప్పంటించడం వల్ల అటవీ సంపద నష్టపోవడంతో పాటు వ న్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుందన్నారు. పర్యావరణ రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బుధవారం  అర్ధరాత్రి మండలంలో వాహనాలు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అటవీ సెక్షన్‌ అధికారి రాథోడ్‌ గులాబ్‌, బీట్‌ అధికారులు జాదవ్‌ ప్రేంసింగ్‌, విఠల్‌, నిఖిత, తదితరులు ఉన్నారు.logo