శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 12, 2020 , 23:34:15

సమ్మేళనానికి సన్నాహాలు

సమ్మేళనానికి సన్నాహాలు

నిర్మల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పంచాయతీరాజ్‌ సమ్మేళనాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. 15 రోజుల్లోగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ మంగళవారం జరిగిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల్లో పంచాయతీరాజ్‌ సమ్మేళనాలను ఈనెల 25లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, ఎం పీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు హా జరుకానున్నారు. నాలుగు జిల్లాల్లో నిర్వహించేందు కు అధికారులు కసరత్తు మొదలెట్టారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని జిల్లాలకు స్థానిక మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రాష్ట్ర అట వీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఉమ్మడి జిల్లా పరిధిలోని నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలో నిర్వహించే సమ్మేళనాలకు ముఖ్య అతిథిగా వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించారు. పంచాయతీరాజ్‌ చట్టంతోపాటు పల్లె ప్రగతిపై అవగాహన కల్పించనున్నారు. సమ్మేళనాల్లో గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఎవ రి బాధ్యత ఏమిటి, సర్పంచులు, కార్యదర్శులు ఏ మి చేయాలో వివరిస్తారు. ఈ సమావేశాల తర్వాత 10 రోజుల గడువు ఇస్తారు. ఆలోగా గ్రామాల రూపురేఖలు మారాల్సి ఉంటుంది. మొత్తానికి 25 రోజుల్లో గ్రామాల పరిస్థితుల్లో మార్పు రావాలి. ఆ తర్వాత జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు ఫ్లయింగ్‌ స్కాడ్‌లను ఏర్పాటు చేశారు. ఏ గ్రామం ఏ మేరకు అభివృద్ధి చెందింది? మార్పు ఏ మేరకు వచ్చిందనే దానిపై తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తాయి. మరోవైపు పట్టణ ప్ర గతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు.


logo