గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 12, 2020 , 23:30:47

నోబెల్‌ వరల్డ్‌ రికార్డ్‌లో తల్లీకూతుళ్లు

నోబెల్‌ వరల్డ్‌ రికార్డ్‌లో తల్లీకూతుళ్లు

రెబ్బెన : బెంగళూరులోని వత్తరులో త్రీజీ యోగాపీఠంలో నిర్వహించిన విశ్వ సంస్కృతి సంభ్రమ 2020 సామూహిక సూర్య నమస్కారాల్లో గోలేటికి చెందిన తల్లీకూతుళ్లు జీ శ్యామల, జీ శ్రీహిత నోబెల్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కించుకున్నారు. వీరు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఏకదాటిగా 12 గంటల పాటు పాల్గొనడంతో ఈ పురస్కారం అందుకున్నట్లు తెలంగాణ యోగా ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షుడు రెవెల్లి రాజలింగు తెలిపారు. గోలేటిలో సింగరేణి యాజమాన్యం అందిస్తున్న యోగా శిక్షణ తీసుకుంటూ ఇంతటి ఘనత సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. వారికి తెలంగాణ యోగా ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షుడు రెవెల్లి రాజలింగు, కార్యదర్శి ప్రసాద్‌, ఉమరాణి అభినందనలు తెలిపారు. 


logo
>>>>>>