ఆదివారం 29 మార్చి 2020
Komarambheem - Feb 12, 2020 , 23:30:47

‘పల్లె ప్రగతి’ పనులు వేగవంతం చేయండి

‘పల్లె ప్రగతి’ పనులు వేగవంతం చేయండి

సిర్పూర్‌(టి) : గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందిని జడ్పీ సీఈవో దాసరి వేణు ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ‘పల్లె ప్రగతి’, ‘ఉపాధి హమీ’ పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో కొనసాగుతున్న వైకుంఠధామాలు, ఇంకుడుగుంతల నిర్మాణాలు, నర్సరీలు, పారిశుధ్య పనులను వెంటనే పూర్తిచేయాలని సూచించారు. ‘పల్లె ప్రగతి’లో నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించి వెంటనే పనులను ప్రారంభించాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న నర్సరీలపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ చునార్కర్‌ సువర్ణ, ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో మహేందర్‌ రెడ్డి, ఏపీవో రామ్మోహన్‌, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.logo