ఆదివారం 29 మార్చి 2020
Komarambheem - Feb 12, 2020 , 00:46:59

ఉత్తమ ఫలితాలు సాధించాలి

ఉత్తమ ఫలితాలు సాధించాలి

సిర్పూర్‌(టి) : ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ మంచి మార్కులు సాధించి, తల్లిదండ్రులకు, కళాశాలకు గుర్తింపు తేవాలని సూచించారు. విద్యార్థులు ఆకలితో ఉండవద్దనే ఉద్దేశంతోనే ఈ భోజనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని సూచించారు. రాష్ట్రస్థాయి వ్యాస రచన పోటీల్లో ప్రతిభ చూపి, గవర్నర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్న హరిదాస్‌ను అభినందించారు. ప్రిన్సిపాల్‌ అతియాఖానమ్‌, మండల కో ఆప్షన్‌ సభ్యుడు కీజర్‌ హుస్సేన్‌, ఉప సర్పంచ్‌ తోట మహేశ్‌, లోనవెల్లి ఎంపీటీసీ సభ్యుడు కర్మాన్‌కర్‌ తుకారం, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బోమ్మన శ్రీనివాస్‌, వార్డు సభ్యులు ఎండీ ఇప్ఫత్‌ హుస్సేన్‌, మోయిజ్‌, అధ్యాపకులు భూపల్లి తిరుపతి, రమేశ్‌, ఘనశ్యాం, తదితరులు పాల్గొన్నారు.


logo