మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Feb 12, 2020 , 00:45:31

రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు అందజేయాలి

రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు అందజేయాలి

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ: జిల్లా రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు  అందజేయాలని లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ చెంచు రామయ్య అన్నారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ విస్తరణ అధికారులు, ఏపీఎంలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి ప్రధానమంత్రి కిసాన్‌ లబ్ధిదారులకు వందశాతం క్రెడిట్‌ కార్డులు అందజేయాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ ఆధికారులు, గ్రామాభివృద్ధి శాఖ అధికారులు, బ్యాంకు అధికారులు కలిసి ఈ నెల 22 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

వాంకిడి: ప్రధానమంత్రి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను రైతు ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎల్‌డీఎం చెంచు రామయ్య సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎస్‌బీఐ కార్యాలయంలో రైతులకు ప్రధానమంత్రి కిసాన్‌ క్రెడిట్‌ కార్డుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  జిల్లాలోని 61,450 మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇవ్వనున్నామనీ, దీని ద్వారా అన్ని రకాల లావాదేవీలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాలను నేరుగా పొందవచ్చని చెప్పారు. ఈ కార్డుల కోసం స్థానిక బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించాలని సూచించారు. అంతకుముందు ఐకేపీ సీసీలతో సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాల రుణాల రికవరీపై చర్చించారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ మేనేజర్‌ గోపాల్‌, ఎస్‌బీఐ సర్విస్‌ పాయింట్‌ నిర్వాహకుడు భిక్షపతి, ఐకేపీ ఏపీఎం మహేశ్‌, సీసీలు భీంరావు, ఆనంద్‌రావు, వేణుగోపాల్‌, శ్యాంరావు పాల్గొన్నారు.logo
>>>>>>