సోమవారం 06 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 12, 2020 , 00:44:35

క్షయపై అవగాహన కలిగి ఉండాలి

క్షయపై అవగాహన కలిగి ఉండాలి

 క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షయ అంటువ్యాధి ఉన్నప్పటికీ సరైన సమయంలో చికిత్స చేయించుకుంటే త్వరగా నయం అవుతుందన్నారు. వారం కంటే ఎక్కువ రోజులు జ్వరం, రాత్రి సమయంలో చలి, దగ్గు ఉంటే ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలని సూచించా రు. ప్రభుత్వం క్షయ నివారణకు మందులు సరఫరా చేస్తుందని చెప్పారు.

డయాబెటిక్‌ రోగులకు క్షయ పరీక్షలు చేయాలి

మండలంలోని డయాబెటిక్‌ రోగులకు క్షయ వ్యాధి పరీక్షలు చేయాలని జిల్లా క్షయ వ్యాధి పోగ్రాం అధికారి కుమ్ర సీతారాం అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలో నమోదు అవుతున్న క్షయ రోగుల వివరాలు సేకరించారు. ఇటీవల నాన్‌ కమ్యూనికేబుల్‌ డీజీజ్‌ (ఎన్‌సీడీ) సర్వే నిర్వహించారనీ, అందులో మండల వ్యాప్తంగా ఎంత మంది బీపీ, షుగర్‌ ఉన్నారు అనేది తేలిందన్నారు. వీరికి క్షయ పరీక్షలు చేయాలని సూచించారు. ఆయన వెంట టీబీ సూపర్‌వైజర్లు గంగాధర్‌, సంతోశ్‌, మండల వైద్యాధికారి నాగేంద్ర, హెచ్‌ఏ కిశోర్‌, రమేశ్‌, లక్ష్మికుమారి, హెచ్‌ఏ భరత్‌, విజయ్‌ తదితరులు ఉన్నారు.


logo