సోమవారం 06 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 12, 2020 , 00:39:17

నేడే సామూహిక పెళ్లి వేడుక

నేడే సామూహిక పెళ్లి వేడుక

బెజ్జూర్‌ : మండలంలోని సోమిని శివారు ప్రాణహిత నది ఒడ్డున ఎర్రబండ రేవు సామూహిక వివాహ వేడుకకు వేదిక కానుంది. సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో బుధవారం 116 జంటలు ఒక్కటవనున్నాయి. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశా రు. జిల్లావ్యాప్తంగా పేద కుటుంబాలకు చెందిన వధూవరులు ఈ వేడుకలో పెళ్లిపీటలెక్కనున్నారు. వేడుకలో భాగంగా ఎమ్మెల్యే దంపతులు తాళితో పాటు నిత్యవసర సరుకులు, వంటపాత్రలు, బీరువాలు తదితర సామగ్రిని వధూవరులకు అందించనున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, తదితర ప్రముఖులు హాజరవనున్నారు.


logo