బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 10, 2020 , 23:27:39

ఏకగ్రీవం @ 113

ఏకగ్రీవం @ 113

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఏగ్రీవాల జోరు సాగింది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ యుగియడంతో బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. జిల్లా వ్యాప్తంగా 12 సంఘాల పరిధిలో 156 వార్డులు ఉండగా, 102 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 113 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 43 స్థానాల్లో 91 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సోమవారం విత్‌డ్రాల అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించారు. ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆసిఫాబాద్‌ మండలంలో 10 మంది అభ్యర్థులు నామినేషన్లు విత్‌డ్రా చేసుకోగా.. 8 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 5 స్థానాల్లో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వాంకిడి మండలంలో 2 నామినేషన్లను అభ్యర్థులు విత్‌ డ్రా చేసుకోగా.. 8 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 5 స్థానాల్లో 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెబ్బెన మండలంలో 19 మంది అభ్యర్థులు విత్‌డ్రా చేసుకోగా.. 11 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 2 స్థానాల్లో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జైనూర్‌ మండలంలో 11 మంది అభ్యర్థులు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో మిగతా 2 స్థానాల్లో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సిర్పూర్‌-యులో 2 నామినేషన్లు విత్‌డ్రా కాగా.. 9 స్థానాలు ఏకగ్రవమయ్యాయి. మిగతా 4 స్థానాల్లో ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సిర్పూర్‌-టి మండలంలో 3 నామినేషన్‌లు విత్‌ డ్రా చేసుకోగా 8 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 5 స్థానాల్లో 14మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దహెగాం మండలంలో 17 నామినేషన్లు విత్‌ డ్రా చేసుకోగా.. 8 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 5 స్థానాల్లో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కౌటాల మండలంలో 13 నామినేషన్లు విత్‌డ్రా చేసుకోగా.. 7 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 6 స్థానాల్లో 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బెజ్జూర్‌ మండలంలో 12 నామినేషన్లు విత్‌డ్రా చేసుకోగా 4 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 9 స్థానాల్లో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా జిల్లాలోని తిర్యాణి, కెరమెరి, కాగజ్‌నగర్‌ మండలాలు పూర్తిగా ఏకగ్రీవం కాగా, ఆ మూడు సొసైటీలు టీఆర్‌ఎస్‌ ఖాతాల్లో చేరాయి. కాగా, అత్యధిక స్థానాలు టీఆర్‌ఎస్‌ మద్దతు దారులు కైవసం చేసుకోవడంతో శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.


logo