బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 10, 2020 , 23:23:24

సల్లంగసూడువెంకన్న స్వామి

సల్లంగసూడువెంకన్న స్వామి

రెబ్బెన మండలం గంగాపూర్‌ బాలాజీ వేంకటేశ్వరస్వామి జాతర సోమవారం ముగిసింది. ఏటా మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించు కొని మూడు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. మొదటి రోజు బాలాజీ కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రెండో రోజు ఆదివారం స్వామి వారి రథోత్సవం కన్నుల పండువగా సాగగా, భక్తజనం తరించింది. సోమవారం చివరి రోజూ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లా నుంచేగాక పక్క రాష్టాల నుంచి వేలాది గా తరలిరావడంతో జాతర ప్రాంగణం కిక్కిరిసింది. గంటలతరబడి క్యూలో నిలబడి స్వామి వారిని దర్శించుకున్నారు. వెంకన్న నామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. పారిశుధ్యం లోపించకుండా చర్యలు చేపట్టిన సిబ్బందిని ఎస్‌ఐ దీకొండ రమేశ్‌, రామారావు, వెంకటెశ్వర్లు, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్‌, ఎంపీవో అంజాద్‌పాషా అభినందిం చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సిబ్బంది పూర్తి సౌకర్యాలు కల్పించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చివరి రోజు కొనుగోలుదారులతో దుకాణాల వద్ద సందడి కనిపించింది.


logo
>>>>>>