శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 10, 2020 , 23:09:53

నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలి

నులిపురుగుల  నివారణ మాత్రలు వేయించాలి

బెజ్జూర్‌ : నులిపురుగుల నివారణకు అల్బెండోజల్‌  మాత్రలు తప్పనిసరిగా వే యించాలని పీహెచ్‌సీ డాక్టర్‌ రుషి అన్నారు. సోమవారం గిరిజన ఆశ్రమ పాఠశాల, కస్తూర్బా, జడ్పీ పాఠశాలతో పాటు ఆయా పాఠశాలల్లో అల్బెండోజల్‌ మాత్రలను అందజేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నులిపురుగులతో పిల్లల్లో ఎదుగుదల తగ్గుతుందన్నారు. అంతేగాకుండా కడపునొప్పి, రక్తహీనత, ఎనిమియా, ఆయాసం తదితర సమస్యలతో బా ధపెడుతాయన్నారు. వాటి నివారణకు అల్బెండోజల్‌ మాత్రలతో నాశనం చేయవచ్చన్నారు. సర్పంచ్‌ అన్సార్‌ హుస్సేన్‌, ఎంపీటీసీ పర్వీన్‌ సుల్తానా, హెచ్‌వీ రేణు క, హెచ్‌ఎం పార్థీరాం, కార్యదర్శి రవికుమార్‌,  ఏఎన్‌ఎం మేఘన, ఆశ వర్కరు వైశాలి, నాయకులు జీవీద్‌ అలీఖాన్‌, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. 

దహెగాం :  స్థానిక కస్తూర్బాలో సోమవారం వైద్యాధికారి చంద్రకిరణ్‌ విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందు లు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 -19 ఏళ్లలోపు వారందరికి తప్పకుండా ఈ మాత్రలు వేయించాలన్నారు. హెచ్‌వీ సోఫియమేరి, వైద్యసిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ 

చింతలమానేపల్లి : మండలంలోని బాలాజీఅన్‌కోడ, అడెపెల్లి, తదితర గ్రామాల్లో సోమవారం చిన్నారులకు నులిపురుగుల మాత్రలను పంపిణీ చేశారు. బాలాజీఅన్‌కోడలో జడ్పీటీసీ శ్రీదేవి చిన్నారులకు మాత్రలు వేశారు. మండల వ్యాప్తంగా మొత్తం 5059 మంది విద్యార్థులకు మాత్రలు అందజేశామని మిగిలిన పిల్లలకు ఈనెల 17న వేయనున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఇందిరాగాంధీ, ఏఎన్‌ఎం రోజ, ఆశ కార్యకర్త రజిత, అంగన్‌వాడీ టీచర్‌ శోభారాణి, ఉప సర్పంచ్‌ సంతోష్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

పెంచికల్‌పేట్‌ : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని అంగన్వాడీ, పాఠశాలల్లో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేసినట్లు వైద్యాధికారి ముస్తఫా తెలిపారు. వైద్య సిబ్బంది , ఉపాధ్యాయులు ఉన్నారు. 

కాగజ్‌నగర్‌ రూరల్‌ : మండలంలోని ఈజ్‌గాం, నజ్రుల్‌నగర్‌, విలేజ్‌ నెం 5 గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు సోమవారం వైద్య సిబ్బంది నులిపురుగుల నివారణ మాత్రలను అందజేశారు. వైద్యులు విద్యావతి, అనీసుద్దీన్‌, ఏఎన్‌ం అనర్తి, విద్యార్థులు పాల్గొన్నారు. 

కాగజ్‌నగర్‌ టౌన్‌: పట్టణంలోని ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థులకు కాగజ్‌నగర్‌ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది నులి పురుగుల నివారణ మాత్రలను అందజేశారు. వైద్యులు చక్రపాణి, ప్రిన్సిపాల్‌ వెంకటయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ గణేశ్‌, ఏఎన్‌ఎం శ్రావణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి): మండలంలో మొత్తం 11215 మంది విద్యార్థులకు 9803 మందికి  నులిపురుగుల నివారణ మాత్రలు వేసినట్లు లోనవెల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి తిరుపతి తెలిపారు . స్థానిక జడ్పీ ఉర్దూ మీడియం పాఠశాలలో మండల కో ఆప్షన్‌ సభ్యుడు కిజర్‌హుస్సేన్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ అతియాఖానమ్‌ విద్యార్థులకు మాత్రలు వేశారు. ఉప సర్పంచ్‌ తోట మహేశ్‌, వార్డు సభ్యులు ఇఫ్ఫత్‌హుస్సేన్‌, మొయిజ్‌, అధ్యాపకులు భూపల్లి తిరుపతి, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


logo