శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 09, 2020 , 23:49:31

వెంకన్న నామస్మరణతో మార్మోగిన గంగాపూర్‌

వెంకన్న నామస్మరణతో మార్మోగిన గంగాపూర్‌

రెబ్బెన : రెబ్బెన మండలం గంగాపూర్‌ గ్రామ శివారులో కొలువైన శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు. ఆదివారం రెండో రోజూ సుమారు లక్ష మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఉదయం కొంత సేపు వర్షం పడినా.. లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో తరలిరావడంతో జాతర పరిస రాలు కిక్కిరిశాయి. సాయంత్రం వేంకటేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. గోవిందా.. గోవిందా.. నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు దర్శనం కోసం రాగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వారికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ తాత్కాలిక చైర్మన్‌ చంద్రయ్య, ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించారు. స్వచ్ఛంద సంస్థ సభ్యలు అన్నదానం చేయడంతో పాటు ఉచితంగా తాగు నీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు మోడెం సుదర్శన్‌గౌడ్‌ వాలంటరీలకు టీ-షర్టులు అందించారు. జాతరలో సఖీ కేంద్రం సిబ్బంది పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించారు. ఎస్పీఎం సిబ్బంది నీలగిరి చెట్ల పెంపకంపై అవగాహన కల్పించారు. ఆసిఫాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. logo