గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 09, 2020 , 23:42:52

‘నులి’పేద్దాం

‘నులి’పేద్దాం

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : పిల్లల ఎదుగుదలకు అడ్డంకిగా మారిన నులి పురుగుల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ నెల 10న(సోమవారం)జిల్లా వ్వాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో, పీహెచ్‌సీల్లో నులిపురుగుల నివారణ మాత్రలు(అల్బెండజో ల్‌) పంపిణీ చేసేందుకు ఇప్పటికే ఆరోగ్య శాఖ అధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.239 మది వైద్యారోగ్య శాఖ సిబ్బంది,769 మంది ఆశ కార్యకర్తలు, 798 మంది అంగన్‌వాడీ సిబ్బంది, 1268 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల సిబ్బంది విధులు నిర్వహించనున్నా రు. జిల్లాలోని 973 అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు 1102 పాఠశాలలకు, 24 జూనియర్‌ కళాశాలలల్లోని విద్యార్థులకు నులి పురుగుల నివారణ మందులను పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 1,79,495 మంది 1-19 సంవత్సరాల వయస్సు పిల్లలున్నారు. ఇప్పటికే అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు, పాఠశాలలకు, కళాశాలలకు మాత్రలు అందుబాటులో ఉంచారు. జిల్లాలో 1,97,345 మాత్రలు అందుబాటులో ఉన్నాయి. జ్వరంతో ఉన్నావారికి మాత్రలు ఇవ్వకూడదని వైద్యులు తెలిపారు. 10న మాత్రలు వేసుకోని పిల్లలకు 17న అందించనున్నారు. పిల్లల మల పరీక్ష ద్వారా నులి పురుగుల అస్థిత్వాన్ని కనిపెడతారు. నులి పురుగుల లార్వాలు 20లోపు ఉంటే మా మూలు, 20-40లోపు ఉంటే మధ్యస్తంగా, 40కిపైగా ఉంటే తీవ్రంగా ఉన్నట్లు భావిస్తారు. వీరందరికి ఆల్బెండజోల్‌ మాత్రలు వేస్తారు. 


logo
>>>>>>