బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 09, 2020 , 23:42:15

బ్యాంకింగ్‌ వ్యవస్థతో కార్మికుల్లో మార్పు

బ్యాంకింగ్‌ వ్యవస్థతో కార్మికుల్లో మార్పు

శ్రీరాంపూర్‌ : సింగరేణి కార్మికులకు గతంలో వేతనాలను గనులపైనే ఇచ్చేవారనీ, ఆ తర్వాత బ్యాంకు ఖాతాల ద్వారా అందించడంతో డబ్బు పొదుపు చేసే అలవాటు  కార్మికుల్లో పెరగిందనీ శ్రీరాంపూర్‌ ఏరియా డీవైజీఎం(పర్సనల్‌) గోవిందరాజు పేర్కొన్నారు. శ్రీరాంపూర్‌ ప్రగతి స్టేడియంలో రెండు రోజులుగా నిర్వహించిన మంచిర్యాల జిల్లా బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు, కార్మికులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి డీవైజీఎం గోవిందరాజు, గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సుఱస్త్రందర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని చెప్పారు. బ్యాంకుల ఉద్యోగులు క్రీడా స్ఫూర్తితో ఖాతాదారులకు మరింతగా సేవలందించాలని కోరారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగులు మానసిక ఒత్తిళ్ల నుంచి దురం అవుతారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో క్రీడా పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. బ్యాంకుల ద్వారా పొదుపు పెరిగి, దుబా రా ఖర్చులు తగ్గించుకుంటున్నారని తెలిపారు. దాంతో వారి జీవన శైలి మారిందనీ, వారి పిల్లలను మంచి ఉన్నత చదువులు అందిస్తున్నారని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు బ్యాంకు ఉద్యోగులు, అధికారులు అందించే సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వహణ కన్వీనర్‌ ఎన్‌వీఎల్‌ఎన్‌ మూర్తి, జిల్లా స్థాయి బ్యాంకర్స్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ నిర్వాహణ అధ్యక్షుడు హవేలి రాజు, మహిళా కన్వీనర్‌ డీ గాయత్రి, సభ్యులు పవన్‌కుమార్‌, బీఆర్‌కే రాజు, ఎం ప్రవీణ్‌రెడ్డి, తోట ప్రదీప్‌, వసంత, అభిలాష్‌, శ్రీనివాస్‌, పవన్‌కుమార్‌, జిల్లాలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు. 


logo