శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 09, 2020 , 23:41:44

మున్సిపల్‌ పాలక వర్గానికి కార్మికుల సన్మానం

మున్సిపల్‌ పాలక వర్గానికి కార్మికుల సన్మానం

సీసీసీ నస్పూర్‌ : నస్పూర్‌ మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ పాలకవర్గం సభ్యులకు సింగరేణి కార్మికులు సన్మానించారు. సీసీసీ టౌన్‌షిప్‌లోని సింగరేణి ఆఫీసర్స్‌ క్లబ్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చైర్మన్‌ ఇసంపల్లి ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బండి పద్మ, బెడికె లక్ష్మి, పూదరి కుమార్‌, మర్రి మొగిలి, చీడం మహేశ్‌తో పాటు టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డిలను సీసీసీ టౌన్‌షిప్‌, ప్రశాంత్‌నగర్‌, గాంధీనగర్‌, లక్ష్మీనగర్‌కు చెందిన కార్మికులు, స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ నస్పూర్‌ మున్సిపల్‌ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు తోట దుర్గాప్రసాద్‌, నాయకులు మండల క్రాంతి, నీలం సదయ్య, సారయ్య, ఇండ్ల ప్రశాంత్‌, సత్యనారాయణ, వీరమల్లు, కాల్వ శ్రీనివాస్‌, పోషమల్లు, కుమారస్వామి, మొ గిలి, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. 

శివాలయ కమిటీ ఆధ్యర్యంలో..

నస్పూర్‌ మున్సిపల్‌  చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లకు నాగార్జునకాలనీలోని శివాలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఆదివారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఇసంపల్లి ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బండి పద్మ, కుర్మిళ్ల అన్నపూర్ణ, మర్రి మొగిలి, పూదరి కుమార్‌, పంబాల గంగా, చీడం మహేశ్‌, బెడికె లక్ష్మిను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తిరుపతిరావు, తోట రాములు, నీలం సదయ్య, లింగయ్య, తిరుపతి, కిరణ్‌, లక్ష్మణ్‌, టీబీజీకేఎస్‌ పిట్‌ కార్యదర్శి మహేందర్‌రెడ్డి, ఈప్ప భూమయ్య, తదితరులు పాల్గొన్నారు. 


logo