గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 09, 2020 , 23:38:35

మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

సీసీసీ నస్పూర్‌ : మహాశివరాత్రి సందర్భంగా గోదావరి నదికి స్నానాల కోసం వచ్చే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆదేశించారు. ఈ నెల 21న మహాశివరాత్రి జరుగనుంది. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి గోదావరి ఇన్‌టెక్‌వెల్‌ పుష్కరఘాట్‌ను పరిశీలించారు. శివరాత్రికి వివిధ ప్రాంతాల నుంచి దాదాపు లక్షకు పైగా భక్తులు వస్తారనీ, ఇందుకు తగినట్లుగానే ఏర్పాట్లు చేయాలన్నారు. సీసీసీ కార్నర్‌ నుంచి గోదావరి నది వరకు రోడ్డుకిరువైపులా ఉన్న ముళ్ల పొదలు, చెత్తా చెదారాన్ని తొలగించాలనీ, విద్యుత్‌ సమస్యలు లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్‌ తలెత్తకుండా చూడాలనీ, పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలనీ, వైద్య శిబిరం, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి గదులు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని డిపార్ట్‌మెంట్ల అధికారులు సమన్వయంతో మహా శివరాత్రి వేడుకలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఇసంపల్లి ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు, కౌన్సిలర్‌ వంగ తిరుపతి, మున్సిపల్‌ కమిషనర్‌ రాధాకిషన్‌, సీసీసీ ఎస్‌ఐ ప్రమోద్‌రెడ్డి, సింగరేణి సివిల్‌ అధికారి సత్యనారాయణ, కౌన్సిలర్లు బండి పద్మ, మర్రి రాజమౌళి, పూదరి కుమార్‌, చీడం మహేశ్‌, బోయ మల్లయ్య, జబిన్‌బేగం, బెడికె లక్ష్మి, మాజీ సర్పంచులు మల్లెత్తుల రాజేంద్రపాణి, ఐత శంకర్‌, నాయకులు హైమద్‌, పంబాల ఎర్రయ్య, తిప్పని రామయ్య, ఒడ్నాల రాయమల్లు, దెబ్బటి రామన్న, జాడి భానుచందర్‌, దగ్గుల మధు, గోపాల్‌రావు, దాసరి సుధాకర్‌, ధర్ని శంకర్‌, మధు, తదితరులు పాల్గొన్నారు. logo