శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 09, 2020 , T00:25

కల్యాణం కమనీయం

కల్యాణం కమనీయం

రెబ్బెన : మండలంలోని గంగాపూర్‌ శివారులోని బాలా జీ వేంకటేశ్వరస్వామి కల్యాణం కమనీయంగా జరిగింది. యేటా మూడు రోజుల పాటు జాతర వైభవం గా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం మొదటి రోజు జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, సిర్పూర్‌(యు) జడ్పీటీసీ అరుణ  స్వామివారికి పట్టువస్ర్తాలు, తలంబ్రాలు తీసుకువచ్చారు. అర్చకులు భక్తుల కోలాహలం నడుమ స్వామి కల్యాణ్యాన్ని వైభవంగా నిర్వహించారు. మహిళలు కోలాటం ఆడుతూ నృత్యాలు చేశారు. స్వచ్ఛంద సంస్థలు అన్నదానం నిర్వహించారు. రెబ్బెన ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఆసిఫాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ వలంటీర్లకు టీషర్టులు అందజేశారు. ఆలయ తాత్కాలిక చైర్మన్‌ గుర్లె చంద్రయ్య, ఈవో బాపిరెడ్డి భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పంచాయతీ  కార్యదర్శులు రవీందర్‌, శంకర్‌ జాతరలో ప్రత్యేకంగా పారిశుధ్య పనులు చేయించారు. logo