గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 09, 2020 , T00:20

జిల్లా ప్రజలు సున్నిత మనస్కులు

జిల్లా ప్రజలు సున్నిత మనస్కులు

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ : జిల్లా ప్రజలు చాల సున్నిత మనస్కులని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ఆయనకు ఆత్మీ య వీడ్కోలు సన్మాన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా మాట్లాడుతూ గతంలో రాజీవ్‌గాంధీ హన్మంతుతో  కలసి పని చేశామని గుర్తు చేశారు. ఆయన మృదుస్వభావి అ న్నారు. జిల్లాలో ఏడాదిన్నరలో ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు.  అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ రాంబాబు మాట్లాడుతూ 17 నెలలుగా ఎంతో నిబద్ధతతో వి ధు లు నిర్వహించారనీ, ఎన్నికలు ప్రశాంతా వాతావరణంలో జరిగేలా చూడడంతో పా టు అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చి విజయవంతం చేశారన్నారు. భవిష్యత్తులో మరింత ఎత్తు కు ఎదగాలని ఆకాక్షించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ జి ల్లా ప్రజల స్థితిగతులపై పూర్థి స్థాయిలో అవగాహన ఉండేవారనీ, సమ యస్ఫూర్తితో సమస్యలను పరిష్కారానికి కృషి చేశారన్నారు. బ దిలీపై వెళ్తున్న కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మం తు మాట్లాడుతూ ఇక్కడ పని చేయడం  అ దృష్టంగా భావిస్తున్నాన్నారు. బాధ్యతలు చేపట్టిన నుంచి అన్ని ఎన్నికలను అందరి సహకారంతో పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేశానన్నారు. శాఖలవారీగా సి బ్బంది కొరత ఉన్నప్పటికీ ఉన్నవారితోనే స మయంలోగా రిపోర్ట్‌ చేసేవారని కొనియాడా రు. టీం వర్క్‌తోనే విజయం సాధిస్తారన్నా రు. అనంతరం రాజీవ్‌గాంధీ హన్మంతును పుష్పగుచ్ఛాలు , శాలువాలతో ఘనంగా స న్మానించి, జ్ఞాపికను అందజేశారు. అంతకుముందు అదనపు ఎస్పీ సు ధీంద్ర, ప్రత్యేకాధికారి ప్రతీక్‌ జైన్‌, డీఎఫ్‌వో లక్ష్మణ్‌ రంజిత్‌నాయక్‌, ఆర్డీవో సిడాం దత్తు, డీటీవో శ్యాం నాయక్‌ కలెక్టర్‌ సేవలను కొనియాడారు.


logo
>>>>>>