గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 08, 2020 , 23:13:44

ముగిసిన నామినేషన్ల స్వీకరణ

ముగిసిన నామినేషన్ల స్వీకరణ

కాగజ్‌నగర్‌ రూరల్‌ :  సహకార సంఘం నామినేషన్ల స్వీకరణ శనివారం ముగిశాయి.  కాగజ్‌నగర్‌ వ్యవసాయ పరపతి సంఘం  కొత్తపేట పరిధిలో ఆఖరు రోజు 15 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారి రామకృష్ణ తెలిపారు. దీని పరిధిలో 13 వార్డులు ఉండగా 1587 మంది ఓటర్లు ఉన్నారు. మొదటి రోజు 2, రెండో రోజు 11, మూడో రోజు15 మొ త్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకటో వార్డు నుంచి సమ్మెట ఉమా మహేశ్వర్‌రావు, కలికోట రమణయ్య, రెండో వార్డు నుంచి నర్సింగోజు సత్యనారాయణ, కాసర్ల మైపాల్‌రెడ్డి, దెబ్బటి జలపతి, మూడో వార్డు నుంచి కేకరి నానాజీ, ఎర్గటి అర్జున్‌, నాలుగో వార్డు నుంచి ఉలికిలబాపు, మేసినేని శంకర్‌, ఐదో వార్డు నుంచి ఎల్లకర్‌ పోచయ్య, భీమన్‌ కార్‌ సోమయ్య, ఆరో వార్డు నుంచి ఎల్లకరి పెంటుబాయి, చౌదరి పద్మ, ఏడో వార్డు నుంచి కోంశాత్‌ శ్రీనివాస్‌, అమనగంటి సాంబయ్య, తన్నీరు సత్యనారాయణ, ఎనిమిదో వార్డు నుంచి ఇరిగిరాల శాంత, పెరుగు కమల, తొమ్మిదో వార్డు  దరని రామయ్య, పదో వార్డు మహ్మద్‌ గులాం సైఫ్‌ అహ్మద్‌, కవుడే కర్రాజీ, మౌల్కర్‌ లక్ష్మణ్‌, 11వ వార్డు నుంచి పెద్దింటి వెంకటేశ్వర్‌రావు, చిట్యాల ఆత్మారావు, 12 వ వార్డు చిప్పకుర్తి నర్సయ్య, చునర్కర్‌ వెంకటయ్య, 13వ వార్డు నుంచి నగ్నూరి తిరుపతి గౌడ్‌, ఎం. తాజుద్దీన్‌ నామినేషన్లు దాఖలు చేశారు. కాగా వార్డు నెం 9 నుంచి ఒకే ఒక్క నామినేషన్‌ వచ్చినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. 

36 నామినేషన్లు  ..

బెజ్జూర్‌ : సహకార సంఘం మొత్తం 36 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి రాజుల నాయుడు తెలిపారు. మొత్తం 13 నియోజకవర్గాలుండగా మొదటి రోజు ఎలాంటి నామినేషన్లు రాలేదు. రెండోరోజు 5 నామినేషన్లు, చివరిరోజు 31 నామినేషన్లు దాఖయలయ్యాయి. ఆదివారం నామినేషన్ల పరిశీలన, సోమవారం ఉపసంహరణ, తుది జాబితా విడుదల చేస్తూ గుర్తులను కూడా కేటాయించనున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఇక ప్రచారానికి నాలుగురోజుల గడువు ఉండగా 15 న ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారి తెలిపారు. 

37 దాఖలు.. 

కౌటాల: మండలంలోని గురుడుపేట సహకార సంఘానికి చివరి రోజు 28 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 13 నియోజక వర్గాలకు మొదటి రోజు 1, రెండో రోజు 8, మూ డో రోజు 28 మొత్తం 37 నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకటో నియోజక వర్గానికి 2, రెండో నియోజక వర్గానికి 2, మూడో నియోజక వర్గానికి 3, నాలుగో నియోజక వర్గానికి 2, ఐదో నియోజక వర్గానికి 1, ఆరో నియోజక వర్గానికి 3, ఏడో నియోజక వర్గానికి 4, నాలుగో నియోజక వర్గానికి 4, తొమ్మిదో నియోజక వర్గానికి 3, పదో నియోజక వర్గానికి 2, 11వ నియోజక వర్గానికి 3, 12వ నియోజక వర్గానికి 4, 13వ నియోజక వర్గానికి 4 నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారి పాలకుర్తి రాజేశ్‌ తెలిపారు. సోమవారం నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. 

ఐదో నియోజకవర్గం ఏకగ్రీవం..

గురుడుపేట సహకార సంఘం ఐదో నియోజక వర్గం ఏకగ్రీ వమయ్యింది. రణవెల్ల గ్రామానికి చెందిన టుస్సె శంకర్‌ ఒక్కరే నామినేషన్‌ వేశారు. గత ఎన్నికల్లో కూడా ఈయన ఇదే నియోజక వర్గం నుంచి ఎన్నికై డైరెక్టర్‌గా పనిచేశారు. ఏకగ్రీవం కావడంతో టీఆర్‌ఎస్‌ నాయకులు సంబురాలు జరుపుకుని డైరెక్టర్‌ శంకర్‌కు స్వీట్లు తినిపించారు. ఎంపీపీ విశ్వనాథ్‌, నానయ్య, కో ఆప్షన్‌ సభ్యులు నాజీం హుస్సేన్‌, అజ్మత్‌ అలీ, ప్రజా ప్రతినిధులు, నాయకులున్నారు. 

దహెగాం : దహెగాం సహకార సంఘానికి చివరి రోజు 23 నామినేషన్లు దాఖ లైనట్లు ఎన్నికల అధికారి ఖాదర్‌హూస్సేన్‌ తెలిపారు. తొమ్మిదో డైరెక్టర్‌ స్థాపానికి తాడూరి రజిత ఒక్కరే నామినేషన్‌ వేయగా, ఏకగ్రీవమైంది. సంఘం పరిధిలో 13 డైరెక్టర్‌ స్థానాలు ఉండగా1529 మంది ఓటర్లు ఉన్నారు. మెదటి రోజు 4, రెండో రోజు 9, చివరి రోజు 23, సిర్పూర్‌(టి) : సహకార సంఘానికి మొత్తం 30 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం చివరి రోజు 23 వచ్చాయన్నారు. 7వ వార్డు, 8,9,10వ వార్డులకు ఒక్క నామినేషన్‌ దాఖలు కావడంతో ఏకగ్రవమైంది. అదే విధంగా ఒకటో వార్డు స్థానానికి సెండె లాలాజీ, రెండో స్థానానికి నయిమాబేగం, 3వ వార్డులో నసీరుద్ధీన్‌, చింతల సత్తయ్య, 4వ వార్డులో కోండగుర్లె హీ రామన్‌, ఎల్ములే పరశురామ్‌, 5వ వార్డులో  పి,రాజేంద్రప్రసాద్‌, 6వ వార్డులో బోబ్బిలి శ్యాంరావు, దోని రవి, 8వ వార్డులో జాడే తులసీరాం, 9వ వార్డులో అబ్దుల్‌ కసీర్‌, 10వ వార్డులో నికోడే వసంత్‌రావు, 11వ వార్డులో అజ్మీరా కృష్ణనాయిని పర్ధేశి, 12వ వార్డులో అజ్మేరా మహేశ్వర్‌, లా వుగే గోపాల్‌, మాండురే శ్యాంరావు, 13వ వార్డులో సుర్పం అర్జు, మానేపల్లి బాపు, కర్పెత బాపు నామినేషన్లు వేశారు. 


logo
>>>>>>