మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Feb 09, 2020 , T00:05

వనంలోకి సమ్మక్క-సారలమ్మ

వనంలోకి సమ్మక్క-సారలమ్మ

కాగజ్‌నగర్‌ రూరల్‌ :  కాగజ్‌నగర్‌ పట్టణ సమీపంలోని పెద్దవాగు తీరాన నాలుగు రోజులుగా జరుగుతున్న సమ్మక్క -సారలమ్మ జాతర ముగిసింది. శనివారం అమ్మవార్లను సిర్పూరు(టి) సివిల్‌ కో ర్టు న్యాయమూర్తి రామారావు దంపతులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పూజారులు స్వరూప, మహి, మహిళలు, భక్తులు హారతి కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం అమ్మవార్లను వనప్రవేశం చేయించారు. ముగింపు కార్యక్రమంలో జాతర కమిటీ అధ్యక్షుడు తుమ్మ రమేశ్‌, కమిటీ సభ్యులు అవధూత శ్రీనివాస్‌, రాజయ్య, పిర్సింగుల శ్రీనివాస్‌, ప్రసాద్‌, పొలో జు శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. 

దహెగాం : మండలంలోని కొంచవెల్లి గ్రామంలో శనివారం సమ్మక్క-సారలమ్మ జాతర వేడుకలు పూజారి దిగిడ పుల్లయ్య ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. వివిధ మండలాలనుంచి భక్తులు బోనాలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు.


logo
>>>>>>