ఆదివారం 29 మార్చి 2020
Komarambheem - Feb 08, 2020 , 01:48:36

ప్రజారోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి

ప్రజారోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రజారోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు అన్నారు. తన కార్యాలయంలో సంబంధిత ఆధికారులతో కరోనా వైరస్‌, మలేరియా జ్వరాల నివారణపై శుక్రవారం సమావే శం ఏర్పాటు చేశారు. మలేరియాపై రక్తపూతలు సేకరణలో సిబ్బందికి నిర్ధేశించిన లక్ష్యం ప్రకా రం  రక్త నమూనాను 24 గంటల్లో సంబంధిత పీహెచ్‌సీలకు పంపించాలన్నారు. లక్ష్యాన్ని చేరుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వైరస్‌ సోకిన రోగుల నుంచి మరొకరికి ఆ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని ప్రజలు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన క ల్పించాలన్నారు. రద్దీగా ఉన్న ప్రదేశంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. మాంసం, గుడ్లు బాగా ఉడికిన తరువాతే తినాలని సూచించారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ కేసు లు లేవనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవస రం లేదన్నారు. ఎలాంటి అనుమానం వచ్చినా మీ సమీపంలోని ప్రభుత్వ వైద్యాధికారిని కలిసి  సూచనలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్‌, డీఈఎంవో సుబ్రహ్మ ణ్యం, ఏఎన్‌ఎంలు, ఎంపీహెచ్‌ఎ(ఎం), సబ్‌ యూనిట్‌ ఆధికారులు పాల్గొన్నారు.


logo