బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 08, 2020 , 01:46:40

ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇంటర్మీడియెట్‌ పరీక్షలు పకడ్బందీగా ని ర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎడ్యుకేషన్‌ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్‌, బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ సెక్రెటరీ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌తో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్లుతో,సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ మార్చి 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు  పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు   కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలనీ, ప్రశ్న పత్రాలు సీసీ కెమెరా నిఘా లో ఉంచాలని ఆదేశించారు. ప్రశ్నాపత్రాలు పోలీస్‌ స్టేషన్‌లో తగు జాగ్రత్తల తో భద్రపరచాలని సూచించారు. కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కిట్లతో ,ఓఆర్‌ఎస్‌ ఫ్యాకెట్లతో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు.ఈ సందర్భంగా పలు సూచలన చేశారు. కలెక్టర్‌ సందీప కుమార్‌ ఝా మాట్లాడుతూ జిల్లాలో 17 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 4,646 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 4017 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. జైనూర్‌, కాగజనగర్‌-ఎ,కాగజ్‌నగర్‌-బీ,సిర్పూర్‌ ,కౌటాల ,బెజ్జ్జూర్‌ ,తిర్యాణి, దహెగాం,ఆసిఫాబాద్‌, కెరమెరి ,వాంకిడి,రెబ్బెన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ,టీటీడబ్ల్యుఆర్‌జెసీ బాలుర ఆసిఫాబాద్‌, టీటీడబ్ల్యుఆర్‌జెసీ బాలికలు ఆసిఫాబాద్‌, ఆదర్శ పాఠశాల ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌లోని బాలభారతి, వివేకానంద కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రవాణ, వైద్యం, తాగునీరు తదితర సౌకర్యాలను కల్పించినట్ల తెలిపారు. అడిషనల్‌ ఎస్పీ సుధీంద్ర, డీఆర్వో ప్రభాకర్‌, ఇంటర్మీడియెట్‌ అధికారి గోపాల్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.logo