మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Feb 08, 2020 , 01:40:48

వనదేవతలకు మొక్కులు

వనదేవతలకు మొక్కులు

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రం పెద్దవాగు తీరంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరలో మూడో రోజు శుక్రవారం భక్తజనం పోటెత్తారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాలను చల్లంగా చూడాలని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ అధికారులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. శనివారం సమ్మక్క సారలమ్మలు జనంలో నుంచి వనంలోకి బయలుదేరానున్నారు.

రెబ్బెన: మండలంలోని నక్కలగూడ, పల్లవి ప్యాక్టరీ వెనుకల, గంగాపూర్‌ శివారులోని గద్దెలపై తల్లులు కొలువు దీరడంతో శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం కూడ  మొక్కులు చెల్లించుకోవచ్చని పూజారులు వినోద, ఇగురుపు స్వామి తెలిపారు. 

తిర్యాణి: మండలంలోని కన్నెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అరటిపల్లి స్టేజ్‌వద్ద జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు శుక్రవారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జాతర నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో గెలుపొందిన రోంపల్లి జట్టుకు,రూ.4501, ద్వితీయ స్థానంలో గెలుపొందిన దేవాపూర్‌ పీసీ రోడ్డు జట్టుకు రూ.3501 నగదును ఆలయ నిర్వాహణ కమిటీ సభ్యులు వెడ్మ మమత, ఆలయ పూజారి బొమ్మగోని సత్య గౌడ్‌ అందజేశారు. కార్యక్రమంలో గోయగాం సర్పాంచ్‌ రమేశ్‌, బాద్సిరావు, గడలపల్లి ఎంపీటీసీ సారా రమేశ్‌ గౌడ్‌, కన్నెపల్లి ఉపసర్పంచ్‌ తోంగల సతీశ్‌, కమిటీ సభ్యులు ఆత్రం సంతోశ్‌, తిరుపతి, రారాజు, పీఈటీలు బ్రహ్మం, శ్రీనివాస్‌, జాతర కమిటీ సభులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.   


logo
>>>>>>