మంగళవారం 31 మార్చి 2020
Komarambheem - Feb 07, 2020 , 01:29:22

మొదటి రోజు 15 నామినేషన్లు

మొదటి రోజు 15 నామినేషన్లు
  • జిల్లాలోని 12 సహకార సంఘాల్లో స్వీకరణ
  • నాలుగు పీఏసీఎస్‌లలో నిల్‌
  • రేపటితో ముగియనున్న గడువు
  • నోడ్యూస్‌, ధ్రువీకరణ పత్రాల కోసం ఆశావహులు బారులు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని 12 సహకార సంఘాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు ఎనిమిది సంఘాల్లో 15 నామినేషన్లు దాఖలు కాగా, మిగతా నాలుగు చోట్ల ఒక్కటీ రాలేదు. శనివారంతో గడువు ముగియనుండగా, నేడు, రేపు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశమున్నది. కాగా పోటీలో నిలిచేందుకు భారీ సంఖ్యలో అభ్యర్థులు ఆసక్తి చూపుతుండగా, నోడ్యూస్‌తో పాటు ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల్లో బారులు దీరుతున్నారు. 


జిల్లాలో సహకార సమరానికి తొలి ఘట్టం ప్రారంభమైంది. 12 సహకార సంఘాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా, మొదటి రోజు 15 నామినేషన్లు అందాయి.  ఆసిఫాబాద్‌ సహకార సంఘంలో 3, దహెగాంలో 4, కౌటాల, వాంకిడి, రెబ్బెన, సిర్పూర్‌-టిలో ఒక టి చొప్పున జైనూర్‌, కాగజ్‌నగర్‌లో రెండు చొప్పు న దాఖలయ్యాయి. మిగితా నాలుగు మండలాల్లో ఒక్కటీ రాలేదు. కాగా శనివారంతో నామినేషన్ల గడువు ముగియనుంది. 


మరోసారి ఎన్నికల వాతావరణం

సహకార నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో జిల్లాలో మరోసారి ఎన్నికల వాతారణం నెలకొంది. ఆసక్తి గల వారు నామినేషన్‌ వేసేందుకు ఏ ర్పాట్లు చేసుకుంటున్నారు. సహకార ఎన్నికలు పార్టీలతో సంబంధం లేకుండా జరిగేవే అయిప్పటికీ, రాజకీయంగా అండదండలు ఉంటే తేలికగా గెలువవచ్చని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా వరుసగా వస్తున్న ఎన్నికల్లో విజయ పథంలో దూసుకుపోతున్న అధికార పార్టీ సపోర్టు పొందేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. పూర్తిగా గ్రామీణ ప్రాం తం వాతావరణంలో కేవలం రైతులే ఓటర్లుగా ఉం డే  ఈ సహకార ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీల మద్దతు పొందే వారు సహకార ఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 


రేపటితో ముగియనున్న గడువు..

సహకార ఎన్నికల నామినేషన్ల గడువు శనివారం తో ముగియనుంది. నామినేషన్‌ వేసేందుకు ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు తమ పంటరుణాలు చెల్లి స్తూ నో డ్యూస్‌ పత్రం తీసుకుంటున్నారు. కావాల్సి న ధ్రువీకర పత్రాలను సరి చూసుకుంటున్నారు. మ రికొందరు ఆయా కార్యాలయాలకు వెళ్లి తీసుకుంటున్నారు. కాగా, శుక్ర, శనివారాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశాలున్నాయి.


logo
>>>>>>