బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 07, 2020 , 01:23:10

బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధికి సర్కారు కృషి

బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధికి సర్కారు కృషి

ఆసిఫాబాద్‌ నమస్తే తెలంగాణ : బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధికి తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలాచారి అన్నా రు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన రాయితీ చెక్కులను ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌, జడ్పీ చైర్‌పర్స్‌న్‌ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. డిగ్రీ, పీజీ  ఇతర దేశాల్లో చదవాలనుకునే బ్రాహ్మణ విద్యార్థులకు వివేకానంద విద్యా పథకం కింద రూ.20లక్షల వరకు రాయితీ రుణాలు అందిస్తున్నా దన్నారు. ఇప్పటి వరకు సరైన అవగాహన లేక జిల్లాలో 14 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారనీ, దీని గడువు తేదీ  ఫిబ్రవరి 29కి పెంచినట్లు పేర్కొన్నారు. 


ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 299 మంది లబ్ధిపొందారనీ, వీరికి 24.13 కోట్లు అందించినట్లు చెప్పారు. అలాగే వేద పండితులు వృద్ధ బ్రాహ్మణులకు నెలకు రూ. 500 చొప్పున పింఛన్‌ అందజేస్తున్నాదన్నారు. ప్రభుత్వ పథకాలను సది ్వనియోగం చేసుకోవాలని సూచిం చారు. అదేవిధంగా నియోజకవర్గాల వారీగా బ్రాహ్మ ణ పరిషత్‌ భవనాల నిర్మాణానికి ఎకరం స్థలం కేటా యించేలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు ఇచ్చేలా చూస్తామన్నారు. కుమ్రం భీం, మంచిర్యాల జిల్లాలోని 38 మంది లబ్ధిదారులకు కోటి 29లక్షల 34914 రూపాయల రాయితీ రుణాలు అంద జేశా మన్నారు. అనంతరం రెండు జిల్లాలోని బ్రాహ్మణ సంఘం పరిషత్‌ నాయకులు వేణుగోపాలచారి, పురాణం సతీశ్‌, కోవలక్ష్మి, ఆత్రం సక్కును సన్మానించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం శర్మ, అడ్వకేట్‌ శిల్ప, రెండు జిల్లాలోని ఐదు నియోజక వర్గాల అధ్యక్షులు, బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు.   


logo