గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 06, 2020 , 01:21:18

కొలువు దీరిన సమ్మక్క సారలమ్మ

కొలువు దీరిన  సమ్మక్క సారలమ్మ
  • కిటకిటలాడిన ఆయా స్థలాలు
  • నిలువెత్తు బంగారం, అమ్మవారికి మొక్కులు
  • నేడు గద్దెకు చేరనున్న సమ్మక్క
  • వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

నమస్తే బృందం, ఆసిఫాబాద్‌:సంప్రదాయ పూజలు, డప్పు వాయిద్యాల నడుమ సారలమ్మ బుధవారం గద్దెపై కొలువుదీరింది. ఈ అపురూపమైన ఘట్టంతో జిల్లావ్యాప్తంగా జాతర ప్రారంభమైంది.  జాతరల ప్రదేశంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్దెల వద్ద నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.జిల్లా కేంద్రంలోని పెద్దవారు తీరంలో జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఆత్రం సక్కు ప్రత్యేక పూజలు చేశారు. రెబ్బెన మండలం గోలేటి పంచాయతీ పరిధిలోని దేవులగూడ సమీపంలో ఏర్పాటు చేసిన జాతరలో జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, జీఎం కొండయ్య ప్రత్యేక పూజలు చేశారు. తిర్యాణి మండలం కన్నెపల్లి గ్రామ పంచాయతీలోని అరటిపెల్లి స్టేజీ వద్ద జాతరలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బెజ్జూర్‌ మండలంలోని శీపెల్లి గుట్ట వద్ద జాతరకు, కాగజ్‌నగర్‌ మండలంలో ఏర్పాటు చేసిన జాతరకు భక్తులు తరలివచ్చారు. జాతర ప్రదేశాల్లో భక్తుల కోసం అధికారులు, కమిటీల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు సమ్మక్క తల్లి గద్దెకు చేరుకోనుండడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశమున్నది.logo
>>>>>>