గురువారం 09 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 06, 2020 , 01:18:41

‘సహకార’ సమరాంగణం

‘సహకార’ సమరాంగణం
  • నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
  • ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
  • ఎన్నికల అధికారుల నియామకం

(ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ) : జిల్లాలో సహకార ఎన్నికలకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15న జరగనున్న ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు నేటి నుంచి (గురువారం) ప్రారంభించనున్నారు. జిల్లాలో 12 ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 15న జరగనున్న సహకార సమరంలో 156 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. జిల్లాలో దీనికి సంబంధించి 156 నియోజకవర్గాలు (వార్డులు) ఏర్పాటు చేశా రు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 సంఘాల్లో 23,788 మంది సభ్యులు ఉండగా, 18,236 మంది ఓటర్లు ఉన్నారు.


ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 6,7,8 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. దీంతో వార్డుల వారీగా అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆ యా పార్టీలు ఎంపిక చేసి బరిలో నిలపడం, సంఘాలలోని అన్ని వార్డుల్లోనూ ప్యానల్‌ను పోటీ చేయించడానికి అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. సంఘం పరిధిలో ఓటు హక్కు కలిగి ఉన్నప్పుడు అదే సంఘంలోనే ఏ వార్డు నుంచైనా పోటీ చేయవచ్చు. బలపరిచే వ్యక్తి సదరు వార్డుకు చెందిన వాడై ఉం డాలి. అభ్యర్థి రెండు సెట్ల వరకు నామినేషన్లను దాఖ లు చేయవచ్చు. తమ వార్డుల్లో రిజర్వేషన్లు అనుకూలంచని నేతలు పొరుగు వార్డులపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో సంఘాల పదవులు కైవసం చేసుకునేలా నేతలు ఎత్తులు వేస్తుండడంతో సహకార పోరు ఊపందుకుంది. ఎన్నికలు పార్టీ రహితమైనా పార్టీలు తమ వారిని బరిలో నిలిపి సంఘాలను కైవసం చేసుకునేందుకు యోచిస్తున్నాయి. 


logo