బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 06, 2020 , 01:09:15

వెనువెంట చేరవేస్తున్నాం : డీఎం

వెనువెంట చేరవేస్తున్నాం : డీఎం

మంచిర్యాల అగ్రికల్చర్‌ : మంచిర్యాల బస్‌స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు మేడారం జాతర ప్రత్యేక కౌం టర్‌ ద్వారా భక్తులకు టికెట్లు ఇస్తూ వెనువెంటనే తరలిస్తున్నామని డిపో మేనేజర్‌ మేకల మల్లేశయ్య బుధవా రం తెలిపారు. మేడారంతో పాటు మంచిర్యాలలో గోదావరి సమీపంలోని జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని పేర్కొన్నారు. మంగళవారం మే డా రం జాతరకు వంద బస్సులు నడిపామని, బుధవారం ఇప్పటికే 63 బస్సులు వెళ్లాయన్నారు. రాత్రి సైతం భక్తులు వస్తుండడంతో వారి రద్దీని దృష్టిలో ఉంచుకొని వాహనాలను పెంచుతున్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుం డా చూస్తున్నామన్నారు. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో భక్తులను మేడారం జాతర గద్దెల వరకు తీసుకువెళ్లే అవకాశం కల్పించిందన్నారు. ఇక్కడ ఎంఎఫ్‌ వీ.మధుసూదన్‌, డీఎం కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ ఎంఎస్‌ పాషా, చంద్రమౌళి, వీ మహేందర్‌, శ్రీలత ఉన్నారు.


logo