శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 05, 2020 , 02:08:15

పల్లె పాలనకు ఏడాది

పల్లె పాలనకు ఏడాది
  • కొత్త జీపీల ఏర్పాటుతో మారిన రూపు రేఖలు
  • 334 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు
  • నెరవేరిన గిరిజనుల దశాబ్దాల కల
  • పాలకవర్గాలు కొలువుదీరి 12 నెలలు
  • రూ. 40.46 కోట్లతో ఊరూరా అభివృద్ధి పనులు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు..’ అన్న బాఫూజీ స్ఫూర్తితో తెలంగాణ సర్కారు అనేక సంస్కరణలు చేపట్టింది. ప్రజలకు పాలనాపరమైన ఇబ్బందులు తొలగించే లక్ష్యంతో కొత్త పంచాయతీలకు పురుడు పోసింది. జిల్లాలో 173 జీపీలకు తోడు కొత్తగా 161 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఆ వెంటే ఎన్నికలు నిర్వహించి గ్రామాల పురోగతికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాకు రూ.40.46 కోట్లు విడుదల చేయగా, అభివృద్ధి పనులతో ఊరూరా పురోగతి కనిపిస్తున్నది. పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరి ఏడాది పూర్తయిన సందర్భంగా.. సాధించిన ప్రగతిపై ప్రత్యేక కథనం.. 


జిల్లాలో పంచాయితీ పాలక వర్గాలు కొలువు ఏ డాది పూర్తయింది...  ఏడాది కాలంలో పల్లెల రూ పురేఖలును ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది.  పల్లెలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు జిల్లాలో ఉ న్న 173 గ్రామ పంచాయతీలను పునర్విభజన చే సి మరో 161 గ్రామ పంచాయతీలను కొత్తగా ఏ ర్పాటు చేసింది. దీంతో జిల్లాలో 334 గ్రామ పంచా యతీలు ఏర్పడ్డాయి. కొత్త పంచాయతీలను ఏర్పా టు చేసిన వెంటనే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి పల్లెల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. ఏడాది కాలంగా జిల్లాలోని గ్రామ పంచాయితీలకు నేరుగా సుమారు రూ. 40 కోట్ల 46 లక్షలను గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేసింది.   కొత్త పంచాయితీల ఏర్పాటుతో పల్లెల అభివృద్ధికి జీవం పోసిన ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక ద్వారా రూపురేఖలు మార్చేసింది. 


రూపురేఖలు మారిన పల్లెలు..

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల రూపు రేఖలు మారాయి.  గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చే పట్టింది. గ్రామాలకు రోడ్డు బాగు చేయడంతోపా టు, పారిశుధ్య పనులు పెద్ద ఎత్తున నిర్వహించారు. మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రాధాన్యం కల్పించా రు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ఈ కార్యక్ర మం ఎంతో ఉపయోగపడింది. ఏడాది కాలంగా గ్రామ పాలనలో గుణాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి పెద్ద పీఠ వేసిం ది. దీనికి అనుగుణంగా పంచాయతీలకు కావాల్సిన అధికారాలు, విధులు, నిధులను అందించి, పల్లెల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేసింది.


మా ఊళ్లో మా పాలన

మా ఊళ్లో మా పాలన  అనే ఆదివాసీల కలను  ప్ర భుత్వం నిజం చేసి ఏడాది పూర్తయింది. గిరిజన గ్రా మాల పూర్తిగా వారికే అప్పగించింది. తమ గ్రామాలను తాము కోరుకున్న విధంగా అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించింది. గిరిజన గ్రామాలను, తండాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో అన్నిరంగాల్లో పల్లెలు ప్రగతిని సాధిస్తున్నాయి.    


 రూ. 40 కోట్ల 46 లక్షలతో పనులు..

గ్రామాల అభివృద్ధికి ఏడాది కాలంగా ప్రభుత్వం  రూ. 40 కోట్ల 46 లక్షలను గ్రామాల అభివృద్ధికి వి డుదల చేసింది.  ప్రత్యేక ్ర పణాళిక ద్వారా  జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలతో మమేకమై ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధి పనులు చే పట్టారు.  గ్రామాలకు రోడ్లు, తాగునీరు, విద్యుత్‌ సమస్యలు పరిష్కరించడంతోపాటు పారిశుధ్య ప నులు పెద్ద ఎత్తున నిర్వహించారు. 


logo