బుధవారం 08 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 05, 2020 , 02:07:19

సహకార ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

సహకార ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : సహకార సంఘాల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సదీప్‌కుమార్‌ ఝా ఎన్నికల సీఈవోలకు సూచించారు. మంగళవారం వారికి ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సహకార సంఘాల ఎన్నికలను పకడ్బందీగా, అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు. ఈ నెల 6, 7, 8వ తేదీల్లో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. 9వ తేదీన పరిశీలన, 10వ తేదీన ఉపసంహరణ గడువు ఉందని తెలిపారు. 15వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారన్నారు. జిల్లాలో 12 సంఘాల్లో ప్రతి సంఘంలోనూ 25 నుంచి 40 దాకా ఓవర్‌ డ్యూ ఉన్న సభ్యులు ఉన్నారన్నారు. వారంతా ఓటు హక్కు వినియోగించుకోవాలనీ, డ్యూ లేకుండా చూసుకోవాలని సూచించారు. సిబ్బంది ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో జేసీ రాంబాబు, జిల్లా సహకార శాఖ అధికారి కృష్ణ, సహకారశాఖ ఆడిట్‌ అధికారి శేక్‌ మహమూద్‌, సీఈవోలు, తదితరులున్నారు.logo