సోమవారం 30 మార్చి 2020
Komarambheem - Feb 05, 2020 , 02:05:57

శుభాకాంక్షల వెల్లువ

శుభాకాంక్షల వెల్లువ

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందీప్‌ కుమార్‌ ఝా ను మంగళవారం ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అలాగే జిల్లా అడిషనల్‌ ఎస్పీ వైవీఎస్‌ సుధీంద్ర, గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్‌, నాయకులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కాండ్రె విశాల్‌, యువజన సంఘాల నాయకులు దినకర్‌, కార్తీక్‌, జడ్పీ సీఈవో వేణు, డిప్యూటీ సీఈవో సాయగౌడ్‌, బాలల సంరక్షణ అధికారి మహేశ్‌, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించారు. వీరితో పాటు కలెక్టర్‌ను కలిసిన వారిలో మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌ గౌడ్‌, గుండి ఎంపీటీసీ గాదెవెణి మల్లేశ్‌, నాయకులు రవీందర్‌, గోపాల్‌ నాయక్‌, శంకర్‌, రమేశ్‌, మంగ, తదితరులు ఉన్నారు.



logo