గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 05, 2020 , 02:03:02

నులి పురుగులను నివారిద్దాం

నులి పురుగులను నివారిద్దాం

ఆసిఫాబాద్‌ టౌన్‌: నులి పురుగుల నిర్మూలనకు కృషి చే యాలని జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో జాతీయ నులిపురుగుల దినోత్సవంపై సమీక్షించారు. ఈ నెల 10న నులిపురుగుల దినోత్సవం సం దర్భంగా జిల్లాలోని కళాశాలలు, పాఠశాలలు,అంగన్‌వాడీ కేంద్రంలో ఏడాది నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న వారందరికీ నులిపురుగుల నివారణ మాత్రలను వేయా లని ఆదేశించారు. ఐదేళ్లలోపు పిల్లలకు సగం మాత్ర, ఆపై వారికి పూర్తి మాత్ర వేయనున్నట్లు తెలిపారు. మ ధ్యాహ్నం భోజనం అనంతరం పిల్లలకు మాత్రలు వే యాలని సూచించారు. జిల్లాలో 1,79. 495 మంది కి మాత్రలు వేయనున్నట్లు చెప్పారు. 10వ తేదీన తప్పిన పిల్లలకు 17న మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. డి ప్యూటీ డీఎంహెచ్‌వోలు సునీల్‌రావు, సుధాకర్‌ నాయ క్‌, ఆర్‌బీఎస్‌ పీవో కృష్ణప్రసాద్‌ తదితరులున్నారు.logo