శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 04, 2020 , 00:54:13

కొత్త కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝూ

కొత్త కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝూ

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ : స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్‌గా సందీప్‌కుమార్‌ ఝా సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. 2018, సెప్టెంబర్‌ ఒకటిన ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్‌గాంధీ హన్మంతు.. వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌గా పని చేస్తున్న సందీప్‌కుమార్‌ ఝాను ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సందీప్‌కుమార్‌ ఝా 2014 ఐఏఎస్‌ బ్యాచ్‌నకు చెందిన వారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా జేసీ రాంబాబు, ఆర్డీవో సిడాం దత్తు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్లా అభివృద్ధిపై తనకు ప్రత్యేక కార్యచరణ ఉం దని, జిల్లాలోని పరిస్థితులపై మందుగా అధికారు లు, సిబ్బందితో చర్చించి ఒక అవగాహనకు వస్తానని తెలిపారు. అధికారుల సమన్వయంతో జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. 

కలెక్టర్‌ బయోడేటాపేరు : సందీప్‌కుమార్‌ ఝా

స్వగ్రామం : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసి

విద్యాభ్యాసం : గుజరాత్‌లోని సైనిక్‌ పాఠశాలలో ప్రాథమిక, మాధ్యమిక విద్య. ఉత్తరప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు.

2014లో ఐఏఎస్‌ ఎంపికై ముస్సోరిలో ట్రైనింగ్‌ తీసుకున్నారు. 2016 వరకు వరంగల్‌లో ట్రైనీ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. 2016 నుంచి 2017 వరకు వికారాబాద్‌ తాండూర్‌లో సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. 2017 నుంచి 2018 వరకు ఖమ్మం కార్పొరేషన్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2018 నుంచి 2019 వరకు జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. తాజాగా.. ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 


logo