సోమవారం 30 మార్చి 2020
Komarambheem - Feb 04, 2020 , 00:52:19

పకడ్బందీగా ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

పకడ్బందీగా ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో  ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్స్‌  పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు డీఐఈవో ఆధికారి గోపాల్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ కళాశాలలో జరుగుతున్న ప్రాక్టికల్స్‌ను పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాక్టికల్స్‌ పరీక్షలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌కు తావులేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నా రు. ఉదయం జనరల్‌ విద్యార్థులు 160 మందికి 160 మం ది విద్యార్థులు హాజరయ్యారు. ఓకేషన్‌లో 298 మందికి 272 మంది  హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో జనరల్‌లో 189 మంది విద్యార్థులకు 185, ఓకేషనల్‌లో 343 మందికి 268 మంది విద్యార్థులు హాజరయ్యారు.logo