శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 04, 2020 , 00:42:15

అర్జీలను తక్షణమే పరిష్కరించాలి

అర్జీలను తక్షణమే పరిష్కరించాలి

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రజలు అంద జేస్తున్న వినతులను తక్షణమే పరిష్కరించాల ని జాయింట్‌ కలెక్టర్‌ రాంబాబు సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలె క్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరం లో   జిల్లాలోని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిం చారు. కాగజ్‌నగర్‌ నివాసి లక్ష్మయ్య తనకు వృద్ధాప్య పింఛన్‌ ఇప్పించాలని వినతి పత్రం అందజేశారు. ఆసిఫాబాద్‌కు చెందిన వేదవతి గ్రూప్‌-1 కోచింగ్‌ కోసం ఆర్థికం సహాయం చేయాలని వినతి ప త్రం అందజేసింది. ఎక్కువగా భూములకు సంబంధించి దర ఖా స్తులు వచ్చినట్లు సంబంధింత ఆధికారులు తెలిపారు. దాదా పుగా 35 మంది వివిధ సమస్యల పరిష్కారం కోసం వినతులు అందజేయగా, వాటిని సంబంధిత అధికారులకు పంపినట్లు పేర్కొన్నారు. ఆర్డీవో సిడాం దత్తు, తదితరులు పాల్గొన్నారు.logo