గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 03, 2020 , 03:46:49

వేసవిలోనూ నిరంతర కరెంట్‌

వేసవిలోనూ నిరంతర కరెంట్‌
  • లోఓల్టేజీ సమస్యపై సంబంధిత శాఖ నజర్‌
  • ఇప్పటికే పల్లెప్రగతిలో భాగంగా స్తంభాలు, తీగల ఏర్పాటు
  • జిల్లావ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు ప్రత్యేక డ్రైవ్‌
  • 73 వేల మీటర్లను పరిశీలించనున్న సిబ్బంది
  • సరఫరాలో అంతరాయాలను అధిగమించేందుకు చర్యలు


కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాల్లో వచ్చే వేసవిలో విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా ఆ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే లోఓల్టేజి సమస్య ఎక్కువగా వేధిస్తూ ఉం టుంది. ఇకపై వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విద్యుత్‌ శాఖ ముందుగానే రం గంలోకి దిగింది. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి, విద్యుత్‌ సమస్యలపై ఆరా తీసి, అక్కడికక్కడే పరిష్కరించాలని నిర్ణయించింది. ప్రతి లైన్‌లో చివరన ఉన్న వినియోగదారుడికి కూడా నాణ్యమైన వి ద్యుత్‌ను అందేలా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే రెండు దఫాలుగా నిర్వహించిన పల్లె ప్రగతిలో విద్యుత్‌ లైనతో పాటు పాటు స్తంభాలు, తీగలను సరిచేశారు. మరోసారి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి వేస వి ఇ బ్బందులు తొలగించేందుకు సన్నద్ధమవుతున్నారు.

  

24 గంటల నాణ్యమైన విద్యుత్‌

జిల్లాలో వ్యవసాయ రంగంతోపాటు, పరిశ్రమలు, గృహ అవసరాలకు ప్రభుత్వం 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నది. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు అధికారులు కూడా వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. జిల్లాలో చిన్న చిన్న సమస్యలు మినహా విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. కానీ వేసవి కాలంలో లో ఓల్టేజీ సమస్య తరుచూ వేధిస్తోంది. దీంతో వచ్చే వేసవి కాలం ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యుత్‌ శాఖ అధికారులు ఇప్పటి నుంచే రంగంలోకి దిగారు.


రెండు డివిజన్లలో డ్రైవ్‌..

జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ డివిజన్లలో సుమారు 73,415 గృహ కనెక్షన్లు ఉన్నాయి. ఈ వినియోగదారులందరికీ వచ్చే వేసవి కాలంలో ఎలాంటి విద్యుత్‌ అంతరాయం కలుగకుండా పూర్తి స్తాయిలో నాణ్యమైన విద్యుత్‌ని అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ప్రతి గ్రామానికి విద్యుత్‌ సరఫరాచేసే లైన్లను పూర్తిస్థాయిలో పరిశీలించడంతోపాటు ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరుపై దృష్టిపెట్టారు. టాంగ్‌ టెస్టర్‌ మీటర్‌ ద్వారా వాటిలో విద్యుత్‌ కెపాసిటీని పరిశీలిస్తున్నారు. కాగజ్‌నగర్‌ డివిజన్‌లో 42,115 మీటర్లు, ఆసిఫాబాద్‌ డివిజన్‌లో 31, 300 మీటర్లు ఉన్నాయి. వీటన్నింటినీ అధికారులు పరిశీలించి, లో ఓల్టేజి సమస్యలు ఉన్న విద్యుత్‌ లైన్లను గుర్తించనున్నారు. ఇదే పనిలో విద్యుత్‌ శాఖ సిబ్బంది ఇప్పటికే నిమగ్నమయ్యారు.  logo
>>>>>>