ఆదివారం 29 మార్చి 2020
Komarambheem - Feb 03, 2020 , 03:38:03

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
  • పదో తరగతి విద్యార్థులకు జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు పిలుపు

కాగజ్‌నగర్‌ రూరల్‌ :జిల్లాలో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎమ్మార్సీ భవనంలో పదో తరగతి చదివే విద్యార్థులకు సోషల్‌ ఫోరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో టాలెంట్‌ టెస్ట్‌ను నిర్వహించారు. 196 మంది పదో తరగతి విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అనంతరం జడ్పీ ఉపాధ్యక్షుడు కృష్ణారావు మాట్లాడుతూ జిల్లాను మొదటి స్థానంలో నిలపాలన్నారు. పరీక్షలంటే ఎలాంటి భయం వద్దని విద్యార్థులకు సూచించారు. టాలెంట్‌ టెస్ట్‌లో ప్రతిభ చూపిన ఆసిఫాబాద్‌ మండలం బురుగూడ జడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలకు చెందిన అశోక్‌ , విశ్వశాంతి పాఠశాలకు చెందిన గంగోత్రిలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీ లక్ష్మీనరసింహం, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు పూర్ణచందర్‌రావు, శంకర్‌, శ్రీనివాస్‌, సత్యనారాయణ, రవిశంకర్‌, లాలాజీ, విద్యార్థులు పాల్గొన్నారు.logo