బుధవారం 01 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 01, 2020 , 23:03:53

రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి

రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి
  • డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి
  • వాంకిడి జూనియర్‌ కళాశాలలో అవగాహన, బైక్‌ ర్యాలీ
  • డీటీవో శ్యాంనాయక్‌
  • పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించద్దు
  • తాగి వాహనాలు నడుపద్దు

వాంకిడి : వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని డీటీవో శ్యాంనాయక్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ  వాహనదారులు లైసెన్స్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, మద్యం తాగి వాహనాలు నడపడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు. యువత హెల్మెట్‌ ధరించడమే కాకుండా తోటి స్నేహితులు ధరించేలా ప్రోత్సాహించాలని సూచించా రు. అంతకుముందు హెల్మెట్‌తో చేపట్టిన ర్యాలీని డీటీవో ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంవీఐలు ఉమామహేశ్వర్‌రావు, సంతోష్‌కుమార్‌, ఏఎంవీఐ శోభన్‌బాబు, ఎస్‌ఐ చంద్రశేఖర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ జాతీ య సేవా పథకం జిల్లా అధికారి చంద్రయ్య, తదితరులు ఉన్నారు.


logo
>>>>>>