శనివారం 04 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 01, 2020 , 23:01:28

ఎస్పీ మల్లారెడ్డి సేవలు మరువలేనివి

ఎస్పీ మల్లారెడ్డి సేవలు మరువలేనివి
  • రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చారు
  • ఇక్కడి ప్రజలు సున్నిత మనస్కులు: ఎస్పీ మల్లారెడ్డి
  • ఆత్మయ సభలో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు

ఆసిఫాబాద్‌,నమస్తే తెలంగాణ : జిల్లాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో ఎస్పీ మల్లారెడ్డి సేవలు మరువలేనివని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. శుక్రవారం రాత్రి ఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌లో ఎస్పీ ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 17 నెలలుగా ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహించి రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి గుర్తింపు తీసుకువచ్చారన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడడమే  కాకుండా అనేక కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా కృషి చేశారన్నారు. అంతకుముందు ఎస్పీ మల్లారెడ్డి మాట్లాడుతూ సమత కేసులో నిందితులకు ఉరిశిక్ష పడడంలో సిబ్బంది తనకు పూర్తి స్థాయిలో సహకరించారనీ, ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. జిల్లా వచ్చిన తర్వాత 2019లో మహోన్నత పురస్కారం అందుకోవడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. 


జిల్లా ప్రజలు సున్నిత మనస్కులని, ప్రతి విషయంలో సహకరించాలరని గుర్తు చేశారు. అంతకుముందు ఏఎస్పీ సుధీంద్ర, కౌటాల సీఐ నరేందర్‌, తిర్యాణి ఎస్‌ఐ రామారావు, పలువురు ఉద్యమ నాయకులు ఎస్పీ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ఎస్పీ దంపతులను ఘనంగా శాలువాలతో సన్మానించి జ్ఞానపికలను అందజేశారు. కార్యక్రమంలో అసిసెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌, జాయింట్‌ కలెక్టర్‌ రాంబాబు, ఏఎస్పీలు వైవీఎస్‌ సుధీంద్ర, సురేశ్‌, ఆదిలాబాద్‌ డీటీసీ ఎల్‌సీ నాయక్‌, జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రాజ్యలక్ష్మి, ఎస్పీఎం వైస్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ జిందాల్‌, సింగరేణి జీఎం కొండయ్య, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ డీఎస్పీలు సత్యనారాయణ, బీఎల్‌ఎన్‌ స్వామి, ఆదివాసీ నాయకులు మోతీరాం, ఎమ్మార్పీఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవ్‌రావు, స్పెషల్‌  పార్టీ పోలీసులు, ఏఆర్‌ పోలీస్‌ విభాగం, జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


logo