గురువారం 02 ఏప్రిల్ 2020
Komarambheem - Feb 01, 2020 , 23:00:21

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ప్రారంభం

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ప్రారంభం

ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శనివారం ప్రాక్టికల్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉద యం జరిగిన పరీక్షల్లో జనరల్‌ విద్యార్థులు 100 మంది హాజరు కావాల్సి ఉండగా, 98 మంది హాజరయ్యారు. ఓకేషనల్‌లో 344 మందికి 270 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షల్లో జనరల్‌లో 80 మందికి 80 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఓకేషనల్‌లో 174 మందికి 164 మంది హాజరయ్యారు. పది మంది గైర్హాజరయ్యారు.logo